Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ నేతలపై కొప్పుల ఈశ్వర్ షాకింగ్ కామెంట్స్

Category : politics state

టీఆర్ఎస్ నాయకుడు ధర్మపురి శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ పార్టీ వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు ప్రజలను దోచుకుతినే పనిలో బిజీగా ఉన్నారు అన్న కొప్పుల ఈశ్వర్ పార్టీ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు దొంగలు తయారయ్యారని, ప్రజల నుంచి పైసలు వసూలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.పైసలడిగే పార్టీ నాయకులను ప్రజలు చెప్పుతో కొట్టాలని షాకింగ్ కామెంట్ చేశారు . జగిత్యాల జిల్లా ధర్మపురి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధాలుగా మారనున్నాయి.

టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు వున్న కొప్పుల ఈశ్వర్ తనను సొంత పార్టీ నేతలే ఓడించాలని కంకణం కుట్టుకుని పనిచేశారని చెప్పుకొచ్చారు. ఇంత ధర్మపురి నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. ధర్మపురి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీలో దొంగలు ఉన్నారని, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ లక్ష రూపాయలు మనం ఇప్పిస్తే ఆ మనిషి వెంట వచ్చి రూ.5 వేలు, రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వాళ్లను కారు ఎక్కించుకుని తీసుక వచ్చి సాయంత్రానికి దావతు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వాళ్లేమో ఎమ్మెల్యే ఇప్పించాడని అనుకోవడం లేదని అన్నారు. వెంట వచ్చిన ఆయన చెప్పడం వల్లనే పైసలు వచ్చాయని అనుకుంటున్నారని అన్నారు. రూ.లక్ష ఇప్పిస్తే 10 వేలు, 20 వేలు.. ట్రాక్టర్లు ఇప్పిస్తే ట్రాక్టర్‌కు రూ.50 వేలు, లక్ష వసూలు చేశారని ఆరోపించారు.

కల్యాణలక్ష్మికీ పైసలు వసూలు చేశారని, ఈ దొంగలను నమ్మొద్దని మనవి చేస్తున్నానని అన్నారు. కల్యాణలక్ష్మికి, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఎవడైనా పైసలు అడిగితే చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. వాడు మా నాయకుడైనా, మరెవరైనా సరే అని ఆయన అన్నారు. ఎందుకంటే డబ్బులు ముఖ్యమంత్రి గారి సహాయ నిధివి అని, అవి మన పైసలు అవి అని ఆయన అన్నారు.

తాను ప్రజలను తప్పు పట్టడం లేదని, నాయకులను మాత్రమే తప్పుబడుతున్నానని అన్నారు. నాయకులు ఎక్కడివారు అక్కడ చేతులెత్తేశారని, పని చేయడానికి ఇష్టపడలేదని ఆయన అన్నారు. వాళ్లకు ఆపతి వచ్చినరోజు తాను అలాగే చేశానా అని ఆయన అడిగారు. తాను చెత్తులెత్తేస్తే గతేమిటని కూడా అడిగారు. మొత్తానికి కొప్పుల ఈశ్వర్ చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తాయి. సొంత పార్టీ నేతలను వేదికల మీద ఎండగడుతున్న తీరు టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది.

Related News