//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొండగట్టు దగ్గర ఘోర ప్రమాదం పెరుగుతున్న మృతుల సంఖ్య...

Category : state

జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది.ఈ బస్సు లో 64 మంది ప్రయాణిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 43 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంసాగర్ నుంచి జగిత్యాల వైపు కొండగట్టు మీద నుంచి కిందకు వస్తుండగా మలువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు.

గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ మరియు ఎస్పీ సింధూ శర్మ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.

అక్కడి స్థానికులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత మంది పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన క్షతగాత్రులకు 5 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు కెసిఆర్.

చనిపోయిన వారి జాబితా

1. నామాల మౌనిక 24 సం ( శనివారంపేట)

2. బైరి రిత్విక్ 3సం ( రామసాగర్)

3. పోలు లక్ష్మి 50 ( హిమత్ రావుపేట)

4. చెర్ల లక్ష్మి 45 ( హిమత్ రావుపేట)

5. గండి లక్ష్మీ 60 ( శనివారం పెట)

6. డబ్బు అమ్మయి 50 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

7. బండపల్లి చిలుకవ్వ 76 (

8. గోలి అమ్మాయి 44 ( శనివారం పేట)

9. తిప్పర్తి వెంకటరత్నం 56

( తిరుమల పూర్)

10. కంకణాల ఎల్లవ్వ 70 (సండ్రలపల్లి)

11. లాంబ కోటవ్వ 65 ( హిమత్ రావుపేట)

12. బందం లసవ్వ 65 ( ముత్యంపేట)

13. బొల్లారం బాబు 54 ( శనివారంపేట)

14. లైసెట్టి చంద్రయ్య 45 (శనివారంపేట)

15. ఎండికల ఎంకవ్వ ( శనివారంపేట)

16.ఇంద్రికాల సుమ 30 (శనివారంపేట)

17. రాజవ్వ 56 (డబ్బు తిమ్మయ్యపల్లి)

18. ఉత్తమ్ నందిని (కొనపూర్)

19 మాల్యాల అనిల్ 19

(హిమత్ రావుపేట)

20. గాజుల చిన్నవ్వ 60 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

21. శమకురా మల్లవ్వ 38 (తిర్మల్పూర్)

22. సలేంద్ర వరలక్ష్మి 28 (శనివారంపేట)

23. కుంబల సునంద 45 (శనివారంపేట)

24. గుడిసె రాజవ్వ 50 ( శనివారం పేట)

25. పందిరి సతవ్వ 75 (హిమత్ రావుపేట)

26. దాసరి సుశీల 55 (తిరుమలపూర్)

27. రాగల ఆనందం 55 (రామసాగర్)

28. నేదునూరి మదనవ్వ 75 ( హిమాత్రవుపేట)

29. చెర్ల హైమా 30 ( హిమాత్రవుపేట)

30. పిడిగు రాజవ్వ 30 (డబ్బు తిమ్మయ్యపల్లి)

31. చెర్ల గంగవ్వ 75 (శనివారం పేట)

32. ఒడినల లసమవ్వా 55 ( తిమ్మయ్యపల్లి)

33. ఒడినల కాశిరం 65 ( తిమ్మయ్యపల్లి)

34 బొంగిని మల్లయ్య 55 (

35. గోల్కొండ లచవ్వ 50( డబ్బు తిమ్మయ్యపల్లి)

36.గోల్కొండ దేవవ్వ 63 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

37.కొండ అరుణ్ సాయి 5 (కోరేం)

38. బొంగోని మదనవ్వా 65

39. ఒత్యం బులక్మి 40 ( కొనపూర్)

40.సోమిడి పుష్ప 45 ( తిర్మల్పూర్)

41. బొంగోని భూమక్క 55 ( పెద్దపల్లి)

42. వేముల భాగ్యవ్వ 50 (హిమాత్రవుపేట)

43. బాలసాని రాజేశ్వరి 40 ( రేకుర్తి)

44. తిరుమని ముత్తయ్య 40 ( రాం సాగర్)

45. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్)