//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పార్టీ మారను !

Category : politics

గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షం నుండి అధికార పక్షం వైపు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా ముఖ్యమంత్రిని కలవడంతో ఆయన కూడా పార్టీ మారేందుకు సిద్దమయ్యారు అనే వార్తలు హాల్ చల్ చేసాయి.

అయితే మరో ఎమ్మెల్యే కోన రఘుపతి కూడా వైసీపీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోన మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

2019లో బాపట్ల నుంచి మళ్ళి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, గెలిచి తీరుతానని జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని బాపట్లను నల్లమడ జిల్లాగా చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో వైసీపీ పట్టణ, మండల అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరరావు, కోకి రాఘవరరెడ్డి, మారం రామకోటి, చెంచయ్య, ఏబేలు తదితరులు పాల్గొన్నారు

Related News