//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొమ్మినేని శ్రీనివాసరావు కు పుత్రవియోగం

Category : politics

ప్రముఖ పాత్రికేయుడు, రచయిత కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఏకైక కుమారుడు శ్రీహర్ష రెండు రోజుల క్రింతం కెనడాలో మరణించాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నశ్రీహర్ష కెనడాలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పుడు ఆయన వయసు 32 ఏళ్ళు.

కొమ్మినేని శ్రీహర్ష గత రెండు సంవత్సరాలుగా కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. దీని చికిత్స నిమిత్తం కెనడా వెళ్ళాడు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రీ హర్ష ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో అయన రెండు రోజుల క్రితం మరణించాడు. దీనితో కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు కెనడా వెళ్లారు. కొడుకు మరణంతో ఈ దంపతులు విషాదంలో మునిగిపోయారు. ఈ మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు కొమ్మినేనిని ఫోన్లో పరామర్శిస్తున్నారు.

కొమ్మినేని శ్రీనివాసరావు అలియాస్ కేఎస్సార్ గా మంచి పేరుంది. ప్రముఖ మీడియా సంస్థ సాక్షి టీవిలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. లైవ్ షో విత్ కేఎస్సార్ ను నిర్వహిస్తున్నారు. సాక్షి లో చేరక ముందు ఎన్టీవీలో చీఫ్ ఎడిటర్ గా పని చేశారు. వీటికంటే ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, దూరదర్శన్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ఎలెక్షన్ల మీద, శాసన సభ చర్చల సరళి మీద పుస్తకాలు రచించారు. ఆయన ఆంధ్రజ్యోతిలో అనేక ఆర్టికల్స్ రాసారు. ఆయన ఆంధ్ర జర్నలిస్టుగా ఉన్నప్పటికీ, టీవీ చర్చల్లో రెండు ప్రాంతాల వారి వాదనలకు సమ ప్రాధాన్యత ఇచ్చేవారని చెబుతుంటారు.

Related News