జనం నాడి పట్టుకోవటంలో కేసీఆర్, కేటీఆర్ లు దిట్ట. అందుకే ఎప్పటికప్పుడు ఏదో కొత్త అంశం మీద జనాల దృష్టి మళ్ళిస్తూ ఉంటారు. తమ వైఫల్యాలు కనిపించనీయకుండా పక్క పార్టీల మీద దాడి చేస్తారు. జనాన్ని సెంటిమెంట్ తో రెచ్చగొడతారు. అంతేనా చాలా చాకచక్యంగా వ్యవహరించి సవాళ్లు విసురుతుంటారు. అది జనాలకు గుర్తండదు. ఒక వేళ గుర్తున్నా అప్పటికి చూసుకుందాం నోరుంది కదా అని వారి ధైర్యం. Komati Reddy Received the KTR Challenge
దళితుడిని సీఎం చేసే విషయంలో తల నరుక్కుంటా అని కేసీఆర్ అని నరుక్కోలేదు. జనం ఏం చేశారు? ఏం చేయలేదు? ఇదీ అంతే అనేది కేటీఆర్ ధైర్యం. అయితే, సొంతంగా అధికారంలోకి రాకపోతే అధికారం నుంచి తప్పుకుంటాను అని కేటీఆర్ తాజాగా వ్యాఖ్యానించాడు. రాకపోతే చూసుకుందాం అనుకున్నాడు కావచ్చు అనేశాడు. మాటదేముంది గాలికిపోయేది. మరి చెప్పిన దానికి కట్టుబడే లక్షణం ఆ కుటుంబానికే లేదు అనేది ప్రత్యర్థి పార్టీల అభిప్రాయం.Komati Reddy Received the KTR Challenge
అయితే ఆయన మాటను కాంగ్రెస్ మాత్రం లైట్ తీసుకోలేదు. కేటీఆర్ సవాల్‌ను కోమటిరెడ్డి స్వీకరించారు. కేటీఆర్ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా నేను ఉన్నానని ప్రకటించిన కోమటిరెడ్డి కేసీఆర్ ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం కాంగ్రెస్ దే అన్నారు. మిమ్మల్ని రాజకీయాల నుంచి తప్పించి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం. అది జరగకపోతే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం అని ప్రతిసవాల్ విసిరారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకులైన కోమటి రెడ్డి బ్రదర్స్ కు ఆ దమ్ము ధైర్యం ఉంది . నల్గొండ జిల్లా మీద మంచి పట్టున్న నేతలు కావటంతో నల్గొండ జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలిపిస్తాం అని చేతున్నారు.Komati Reddy Received the KTR Challenge
టీఆర్ఎస్ ది వ్యాపారం. అందుకే ఉద్యమకారుల గొంతుకోసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు విషయంలో సామాజిక న్యాయం పాటించామని.. ఎక్కువ సీట్లు బీసీలకు కేటాయించామని ఆయన వివరించారు. రెబల్స్‌ను కొనడానికి ఇన్నాళ్లు టీఆర్ఎస్ అవినీతి చేసి డబ్బు సంపాదించిందని అన్నారు. ఓటర్లకు అంతా తెలుసు. మిమ్మల్ని తరిమేస్తారు అన్న కోమటిరెడ్డి టీఆర్ఎస్ నుండి తెలంగాణాకు విముక్తి కల్పిస్తాం అని చెప్పి ప్రతి సవాల్ విసిరిన నేపధ్యంలో కేటీఆర్ రిప్లయి ఎలా ఇస్తాడో మరి.Komati Reddy Received the KTR Challenge