//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి రానున్న ...అజిత్ ‘విశ్వాసం’

Category : movies

తమిళ స్టార్ హీరో అజిత్‌కు తమిళంలో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఒక్క తమిళంలోనే కాదు, తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తమిళ నట సూపర్ స్టార్ రజనీ కి ఎంత క్రేజ్ ఉందొ ఆ స్థాయి ఫాన్స్ ఫాలోయింగ్ ఆయన సొంతం.ఇప్పటివరకు అజిత్ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ చేయకున్నా...ఆయన నటించిన అనువాద చిత్రాలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. అందుకు ఉదాహరణ 2015లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్నై అరింధాల్’ సినిమా ‘ఎంతవాడు గాని..’ పేరిట తెలుగులోకి అనువాదమైంది. ఈ సినిమా తెలుగులోను విశేష స్పందన లభించింది.

ఆ తరవాత అజిత్ సినిమాలేవీ తెలుగులో డబ్ కాలేదు. మూడేళ్ల గ్యాప్ తరువాత అజిత్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

తాజాగా అజిత్ నటించిన వీరం, వేదాళం,వివేకం వంటి సూప‌ర్ డూప‌ర్స్ గా నిలిచాయి. ఈ మూడు సినిమాల తరువాత డైరెక్టర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్షన్ డ్రామా ‘విశ్వాసం’. త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్కడ సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టించింది. ఇదే సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ 'పెటా' సినిమాకి ధీటుగా వసూళ్లు రాబట్టాడు అజిత్.అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ కొన్న నిర్మాత ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ అధినేత ఆర్.నాగేశ్వర‌రావు మాట్లాడుతూ.. ‘అజిత్, శివ కాంబినేష‌న్‌లో మూడు వ‌రుస బ్లాక్ బ‌స్టర్ చిత్రాలు వచ్చాయి.

వీరి క‌ల‌యిక‌లో వచ్చిన నాలుగో బ్లాక్ బస్టర్ ‘విశ్వాసం’. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాడులో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ఎందరో నిర్మాత‌లు ఈ సినిమా తెలుగు హ‌క్కుల కోసం పోటీ ప‌డ్డారు. ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో తెలుగు హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాను. అవ‌కాశం ఇచ్చిన స‌త్యజ్యోతి ఫిలింస్ వారికి నా ధన్యవాదాలు. ఇందులో టాలీవుడ్‌కి చెందిన విల‌క్షణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో న‌టించారు. అనువాద కార్యక్రమాల‌న్నింటినీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు మీడియాకు తెలియజేశారు.

Related News