Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్టార్ కమెడియన్ వడివేలు తీరు పై ..... స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కోలీవుడ్ దర్శకుడు

Category : movies

గత కొన్ని రోజులుగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ ప్రముఖ కమెడియన్ మరో దిగ్గజ దర్శకుడి గురించి వ్యాఖ్యానిస్తూ పలు రకాల విమర్శలు చేయడం జరిగింది. తమిళ సినిమా స్థాయిని మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా స్థాయినే హాలీవుడ్ రేంజ్ కు తీసుకు వెళ్లిన ప్రముఖ దర్శకుడు శంకర్. రోబో మరియు 2.ఓ చిత్రాలతో హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని ఇండియన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అంతటి గొప్ప దర్శకుడిని ఇటీవల తమిళ కమెడియన్ వడివేలు నోటికి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శంకర్ దర్శకత్వం పటిమపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. శంకర్ కు గ్రాఫిక్స్ తప్ప మరేం చేతకాదని కేవలం ఆయన గ్రాఫిక్స్ వల్లే ఇంత పేరు తెచ్చుకున్నాడని వడివేలు అనడం. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదంగా మారింది.ఈ సందర్భంలో వడివేలు సదరు ఛానెల్ వారితో మాట్లాడుతూ....

శంకర్ సినిమా దర్శకుడిగా కాకుండా గ్రాఫిక్స్ డైరెక్టర్ గా చెప్పుకోవాలని పేర్కొనడం గమనార్హం.అయితే గతంలో నటుడు వడివేలు,దర్శకుడు శంకర్ కామీనేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రావడం జరిగింది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పేట్టి మరి ఆయన ఇలా మాట్లాడటం కోలీవుడ్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.అయితే గత కొంతకాలంగా ఈ ఇద్దరి మద్య కొన్ని వివాదాలు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే వడివేలు ఈస్థాయిలో శంకర్ పై విరుచుకు పడ్డాడని సమాచారం. అయితే శంకర్ వంటి దిగ్గజ దర్శకుడిని వడివేలు విమర్శించడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇదే విషయం పై ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించాడు.

దర్శకుడు అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. అలాంటి దర్శకుడికి నటీనటులు అంతా కూడా సముచిత గౌరవం ఇవ్వాలి. ఒక సినిమా హిట్ అయితే అందరికి మంచి పేరు వస్తుంది.. కాని ఫ్లాప్ అయితే దర్శకుడే ఆ చెడ్డ పేరును మోయాల్సి ఉంటుంది. అలాంటి దర్శకుడికి గౌరవం తప్పకుండా ఇవ్వాలి. వడివేలు కమెడియన్ గా తన కెరీర్ లో సాధించిన విజయాల్లో శంకర్ సినిమాలు కీలకం అనే విషయం నువ్వు గుర్తించుకోవాలి. తమిళ సినిమా స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకు వెళ్లిన గొప్ప దర్శకుడు శంకర్. ఆయన గురించి తప్పుగా మాట్లాడటం ఆయన్ను అవమానించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని వెంకట్ ప్రభు సీరియస్ గా వడివేలుకు వార్నింగ్ ఇచ్చాడు.ఇలా చాలా మంది ప్రముఖులు వడివేలు తీరు పై మండిపడుతున్నారు.

Related News