//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జీఎస్‌టీపై కొలకత్తా సెక్స్‌వర్కర్లు మండిపాటు

Category : national

శానిటరీ నాప్కిన్స్‌నూ వదలకుండా 12 శాతం జీఎస్‌టీ విధించడంతో ఆసియాలోనే అతిపెద్ద రెడ్‌లైట్‌ ఏరియాగా పేరొందిన కొలకత్తాలోని  సోనాగచిలో గల సెక్స్‌వర్కర్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పరిశుభ్రత క్యాంపెయిన్‌లో భాగంగా సెక్స్‌ వర్కర్లలో అవగాహన పెంచడంతో వారిలో నాప్‌కిన్స్‌ వాడే వారి సంఖ్య గతంలో 20 శాతం నుంచి 85 శాతానికి పెరిగింది.

అయితే జీఎస్‌టీ భారంతో ఇప్పుడు వారంతా మళ్లీ వెనుకటి పరిస్థితికి మళ్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కండోమ్స్‌పై జీరో ట్యాక్స్‌ నిర్ణయం బాగానే ఉన్నా నాప్‌కిన్స్‌పై 12 శాతం పన్ను విధించడం బాధాకరమని 1.30 లక్షల మంది సెక్స్‌వర్కర్లతో కూడిన దర్బార్‌ మహిళా సమన్వయ కమిటీ(డీఎంఎస్‌సీ) ఆవేదన వ్యక్తం చేసింది.సెక్స్‌వర్కర్లలో అవగాహన పెంచడంతో పాటు సబ్సిడీపై నాప్‌కిన్స్‌ను అందించడంతో వీటి వాడకం ఇటీవల గణనీయంగా పెరిగిందని డీఎంఎస్‌సీ ప్రతినిధి సమర్జిత్‌ జన పేర్కొన్నారు. 

నాప్‌కిన్స్‌పై 12 శాతం పన్ను విధించడంతో వీటి వాడకం తగ్గుముఖం పట్టి సెక్స్‌వర్కర్ల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెరిగితే తాను నాప్‌కిన్స్‌ను వాడబోనని 35 ఏండ్ల సెక్స్‌వర్కర్‌ సోమ చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది. వీటి వాడకం తమకు తప్పనిసరైనా ధరలు పెరిగితే మాత్రం నాప్‌కిన్స్‌కు ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.