Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేకేఆర్ కెప్టెన్ గా దినేశ్‌ కార్తీక్‌..!

Category : sports

ఐపీల్ లో మరో ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ గా మన ముందుకు రానున్నాడు.ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేశారు.ఇంతకు ముందు వరకు కేకేఆర్ కు ఇండియన్ స్టార్ బ్యాట్సమెన్ గౌతమ్ గంబీర్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

ఈ సారి జరిగిన వేలం లో గంబీర్ ను కేకేఆర్ ను వదులుకుంది . దీనితో ఎవరిని కెప్టెన్ గా నియమించాలో చాలా రోజుల పాటు జట్టు మేనేజ్మెంట్ చర్చలు జరిపారు.ఈ చర్చలలో భాగంగా రాబిన్ ఉతప్ప,సునీల్ నరైన్ పేర్లు ప్రముఖం గా వినిపించాయి.తరువాత ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ లిన్‌ను కెప్టెన్‌గా చేయాలని కేకేఆర్‌ అనుకున్నప్పటికీ లిన్ పీఎస్‌ఎల్‌ లో గాయపడటంతో అతని పేరును కెప్టెన్ లిస్ట్ నుండి తీసి వేశారు .

దీనితో దినేష్ కార్తీక్ వైపు జట్టు మేనేజ్మెంట్ మొగ్గుచూపింది.ఆ విధంగా కెప్టెన్ గా దినేష్ కార్తీక్ ను నియమిస్తున్నట్టు జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది.ఐపీల్ లో దినేష్ కార్తీక్ మొత్తం 152 మ్యాచులు ఆడాడు.ఈ మ్యాచులలో మొత్తం 2903 రన్స్ చేసాడు.బ్యాట్స్ మెన్ కాకుండా దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ గా కూడా విధులు నిర్వహిస్తాడు.దీనితో కేకేఆర్ టీం మేనేజ్మెంట్ దినేష్ కార్తీక్ కె మొగ్గుచూపింది.

Related News