ఐపీల్ వేలంపాటలో ఆశ్చర్యకరం ఏమైనా ఉంది అంటే విధ్వంశక ఆటగాడు క్రిస్ గేల్ ని బెంగళూరు కొనుగోలు చెయ్యకపోవడమే. ఆ జట్ట తరుపున సుదీర్గంగా ఆడిన గేల్ ని బెంగళూరు కొనే సాహసం చెయ్యలేదు. ఆ తర్వాత వేలం పాటలో గేల్ ని పంజాబ్ అతని కనీస ధరకే దక్కించుకుంది. ముఖ్యంగా ఐపియల్ లో గేల్ కి మంచి రికార్డ్ ఉన్న సంగతి తెలిసిందే. పూణే వారియర్స్ పై అతను ఆడిన ఆట ఇప్పటికి ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు. ఆ తర్వాత గేల్ మా జట్టులో ఉంటె బాగుండేది అని ప్రతి జట్టు భావించింది.
అయితే గత కొంత కాలంగా ఫాం లేమితో ఇబ్బంది పడుతున్న గేల్ కి వయసు కూడా మీద పడుతుంది. దీనితో అతనిని కొనుగోలు చెయ్యడానికి ఎవరు ఆశక్తి చూపించలేదు. ఇదిలా ఉంటె గేల్ ని తాము ఎందుకు తీసుకోలేదో సారధి కోహ్లి వివరించాడు. గత కొన్నేళ్లుగా గేల్ రాయల్ చాలెంజర్స్‌కు ఎంతో ఆడాడు. గేల్‌కు వయసుతో సంబంధం లేదు. కాకపోతే వచ్చే మూడేళ్లను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అతనికి బదులు ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలనుకున్నాం. ఈ క్రమంలోనే గేల్‌ను వదులుకోవాల్సి వచ్చింది' అని కోహ్లి వివరించాడు.