నాలుగో వన్డేలో విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. రెండో ఓవర్లో ధవన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ బ్యాట్‌తో రెచ్చిపోతున్నాడు. బౌలర్ బంతి విసరడమే పాపమన్నట్టు వాటిని బండరీలకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో కేవలం 76 బంతుల్లోనే 14 ఫోర్లు, సిక్సర్‌తో వన్డేల్లో 29 సెంచరీ ని కోహ్లీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 131 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ కూడా వీరబాదుడతో బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసే సరికిరెండు వికెట్ల నష్టానికి 230పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 131 రోహిత్ శర్మ 90 పరుగులతో ఆడుతున్నారు.
నాలుగో వన్డేలో భారత్‌కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఫెర్నాండో వేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ శిఖర్ ధవన్ (4).. పుష్పకుమారకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫలితంగా ఆరు పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (3), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.