//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాలుగో వన్డేలో కోహ్లీ, రోహిత్ శతకాల మోత

Category : sports

శ్రీలంక పర్యటనలో భారత్‌ ఎదురులేని విజయాలతో దూసుకెళ్తోంది. కొలంబో వేదికగా సాగిన నాలుగో వన్డేలో శ్రీలంకపై 168 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శతకాల మోతకు తోడుగా చివర్లో ధోనీ, మనీష్‌ పాండే వేగమైన సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా సిరీస్‌లోనే అత్యధిక భారీ స్కోర్‌ 375/5 ను సాధించింది. ప్రపంచ కప్‌-2019కు నేరుగా అర్హత సాధించడానికి ఖచ్చి తంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 42.4 ఓవర్లలోనే 207 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది.

భారత జట్టు మూడు మార్పులతో బరిలో దిగింది. కేదారి జాదవ్‌, భువనేశ్వర్‌, చాహల్‌కు విశ్రాంతినిచ్చారు. ఫాస్ట్‌ బౌలర్‌గా శార్థూల్‌ ఠాకూర్‌ తొలి వన్డేలో ఆడాడు. అక్షరపటేల్‌, కులీదీప్‌లు తుది జట్టులోకి వచ్చారు.భారత్‌ అటు బ్యాటింగ్‌, ఇటు ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యంతో తిరుగులేని విజయ ఢంకాను మోగించింది. సిరీస్‌లో ఐదో వన్డే సెప్టెంబర్‌ 3నఇరుజట్ల మధ్య కొలంబో వేదికగానే జరగనుంది.

భారీ లక్ష్య చేధనలో శ్రీలంక బొక్కాబొర్లా పడింది.డిక్వెల్లా 14 వద్ద మెండిస్‌ 1 ,మన్వీరా 11, తిరుమాన్నే 18 సిరివర్థనే 39 ఔటయ్యారు.141కే సగం వికెట్లను శ్రీలంక కోల్పోయింది. ఐదో వికెట్‌కు అంగోలా, సిరివర్థనే 73 పరుగుల భాగ స్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత డిసిల్వా 22 వద్ద ఆరో వికెట్‌గా వెను దిరిగాడు.

మ్యా థ్యూస్‌ను 70 పరుగుల వద్ద అక్షర పటేల్‌ బౌలింగ్‌లో ఠాకూర్‌ క్యాచ్‌ పట్టగా ఔటయ్యాడు. పుష్ప కుమారను 3 వద్ద బుమ్రా ఔట్‌ చేశాడు. దీంతో 196 వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. చివర్లో చైన్‌మన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ వేర్వేరు ఓవర్లలో ఫెర్నాండ్‌ 5, కెప్టెన్‌ మలింగను సున్నా వద్ద డకౌట్‌ చేసి భారత్‌ పనిని తొందరగా కానిచ్చేశాడు.

భారత్‌ నాలుగో వన్డేలో అత్యధిక పరుగులు 375/5తో దుమ్మురేపింది.టాస్‌ గెలిచిన విరాట్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ 375/5 పరుగులను చేసింది.శ్రీలంకపై ఏ జట్టు నమోదు చేయని స్కోర్‌ను టీమిండియా సాధించడం గమనార్హం.

 కోహ్లీ, రోహిత్‌ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 29 ఓవర్లలో 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియా భారీ స్కోర్‌ను సాధించింది. శిఖర్‌ ధావన్‌ రెండో ఓవర్‌లోనే ఔట్‌ కాగా రోహిత్‌ కలిసిన సమన్వయంతో ఆడిన కోహ్లీ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. కోహ్లీ 131 వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగిన సమయంలో హర్ధిక్‌ పాండ్య నాలుగో నెం:4 బ్యాట్స్‌ మెన్‌గా బరిలో దిగాడు.

పాండ్య 19, వద్ద రోహిత్‌ 104 పరుగుల వద్ద అంగోలా మ్యాథ్యూస్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఆ తర్వాత కెఎల్‌ రాహుల్‌ను అకిలా ధనుంజయ ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో ఆరో వికెట్‌కు ధోనీ, పాండే 101 పరుగులతో నిలిచారు. ఆట ముగిసే సమయానికి ధోనీ 49 పరుగులతోను, మనీష్‌ పాండే 42 బంతుల్లో 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.