//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సచిన్ రికార్డు లను అధిగమిస్తున్న కోహ్లీ !

Category : sports

ఎప్ప‌టికైనా స‌చిన్ పేరిటున్న రికార్డుల‌ను  అధిగమించే సత్తా తనకే ఉందని  ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లికే నిరూపించు కొంటున్నారు. తాజాగా మాస్ట‌ర్ పేరిట ఉన్న మ‌రో రికార్డును చెరిపేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. 

వెస్టిండీస్‌తో జరిగిన ఐదో వ‌న్డేలో సెంచ‌రీ చేసిన కోహ్లి చేజింగ్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన బ్యాట్స్‌మ‌న్‌గా నిలిచాడు. విండీస్‌పై ఐదో వ‌న్డేలో చేసిన సెంచ‌రీ విరాట్‌కు ఓవ‌రాల్‌గా 28వది కాగా,  చేజింగ్‌లో 18వ సెంచ‌రీ కావ‌డం విశేషం. దీంతో ఇన్నాళ్లూ స‌చిన్ (17) పేరిట ఉన్న రికార్డు మ‌రుగున ప‌డిపోయింది. 

అంతేకాదు ఈ సెంచ‌రీలు చేయ‌డానికి ఈ ఇద్ద‌రూ ఆడిన ఇన్నింగ్స్‌లో కూడా చాలా తేడా ఉంది. సచిన్ చేజింగ్‌లో 17 సెంచ‌రీలు చేయ‌డానికి 232 ఇన్నింగ్స్ ఆడ‌గా, విరాట్ మాత్రం కేవ‌లం 102 ఇన్నింగ్స్‌లోనే 18 సెంచ‌రీలు చేయ‌డం విశేషం. 

ఈ ఇద్ద‌రి త‌ర్వాత చేజింగ్‌లో 11 సెంచ‌రీల‌తో శ్రీలంక మాజీ బ్యాట్స్‌మ‌న్ తిల‌క‌ర‌త్నె దిల్షాన్ ఉన్నాడు. ఇక క‌రీబియ‌న్ దీవుల్లో విండీస్‌పై కెప్టెన్‌గా రెండు సెంచ‌రీలు చేశాడు విరాట్‌. ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త కెప్టెన్ కూడా కోహ్లియే. గ‌తంలో రాహుల్ ద్ర‌విడ్ కెప్టెన్‌గా ఒక సెంచ‌రీ చేశాడు. ఓవ‌రాల్‌గా విండీస్‌పై కోహ్లికి ఇది నాలుగో సెంచ‌రీ.