//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడాం .కోహ్లీ .

Category : sports

బ్యాటింగ్‌లో రాణించలేకపోయినందుకే ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలయ్యామని భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. గువాహటిలో మంగళవారం జరిగిన టీ20లో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఆసీస్‌ బౌలర్‌ బెరెన్‌డార్ఫ్‌ ధాటికి కుప్పకూలిన సంగతి తెలిసిందే.

మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘మా జట్టులోని బ్యాట్స్‌మెన్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. మైదానంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుండగా వికెట్లను చేజార్చుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఫీల్డింగ్‌లో 120 శాతం కష్టపడాలి. ఆసీస్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ తాను అనుకున్న వ్యూహాలను అమలు చేయడంలో విజయవంతమయ్యాడు. జేసన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఆసీస్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు. మంచి ఎత్తుతో పదునైన బంతులు విసిరాడు. ఈ మ్యాచులో ఆసీస్‌ మాకెంటే బాగా ఆడింది. అందుకే విజయం సొంతం చేసుకోగలిగింది’ అని కోహ్లీ తెలిపాడు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 ఈ నెల 13న హైదరాబాద్‌లో జరగనుంది.

Related News