Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు రనౌట్ల రికార్డు నమోదు చేశారు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో కోహ్లి రనౌట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య సమన్వయ లోపం మరోసారి చర్చనీయాంశమైంది.

వన్డేల్లో వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్నపుడు ఎవరో ఒకరు రనౌట్‌ కావడమిది ఏడోసారి కావడం గమనార్హం. ఏడు రనౌట్లలో కోహ్లీవే ఐదు కాగా రెండుసార్లు రోహిత్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలా కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్‌ సెంచరీలు (209, 264) నమోదు చేయడం విశేషం. ఐదో వన్డేలో సైతం రోహిత్‌(115) సెంచరీతో కదం తొక్కాడు.

ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధికంగా రనౌట్లున్న భారత జోడీ సచిన్‌-గంగూలీలదే. వాళ్లిద్దరి మధ్య 176 భాగస్వామ్యాలు నమోదవగా తొమ్మిదిసార్లు ఎవరో ఒకరు రనౌటయ్యారు. ద్రవిడ్‌-గంగూలీ 87 భాగస్వామ్యాల్లో ఏడు రనౌట్లతో రెండో స్థానంలో ఉండగా కోహ్లి-రోహిత్‌ వారిని సమం చేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.

వీళ్లిద్దరి మధ్య 62 భాగస్వామ్యాల్లోనే ఏడు రనౌట్లుండటం విశేషం. గత పదేళ్లలో అత్యధిక రనౌట్లున్న జోడీల్లో వీరిది రెండో స్థానం కాగా డివిలియర్స్‌-డుప్లెసిస్‌(8), సంగక్కర- దిల్షాన్‌(8)లు తొలి స్థానంలో ఉన్నారు.

ఐతే సౌత్ ఆఫ్రికా తో జరిగిన ఐదో వన్డే మ్యాచ్ లో ఇండియా టీం విజయాన్ని నమోదుచేసింది.బాటింగ్ లో రోహిత్ సెంచరీ చేస్తే,ధావన్ కోహ్లీ విలువైన బాగస్వామ్యాలను నమోదు చేసారు.ఈ మ్యాచ్‌లో భారత్‌ 73 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం అందుకున్న విషయం తెలిసిందే. సిరీస్ కూడా భారత్ వశమైంది.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 4 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 16 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 15 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!