//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీసీసీఐ పై కోహ్లీ అసంతృప్తి

Category : sports

కొన్ని రోజుల క్రితం భారత క్రికెట్ బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్ల జీతాలను భారీగా పెంచేసింది బీసీసీఐ. గ్రేడ్ ' ఏ', 'బి' మరియు 'సి 'ఆటగాళ్లకు మరియు సహాయక సిబ్బందికి జీతాలను పెంచారు. గ్రేడ్ ' ఏ ' కు కోటి నుండి 2 కోట్లకు, 'బి' గ్రేడ్ కి 50 లక్షల నుండి కోటికి, 'సి' గ్రేడ్ కు 25 లక్షల నుండి 50 లక్షలకు పెంచుతూ బీసీసీఐ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంపు తమకు ఎంతమాత్రం సమ్మతం కాదని కేప్టెన్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గ్రేడ్ 'ఏ' ఆటగాళ్లకు 5 కోట్లు ఇవ్వాలని, టెస్ట్ మరియు వన్డేలు ఆడే ఆటగాళ్లకు, ఒక్కే ఫార్మాట్ ఆడే వాళ్లకు ఇచ్చే జీతాల్లో వ్యత్యాసం ఉండాలని డిమాండ్ చేసినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కోచ్ కుంబ్లే కోహ్లీకి మద్దతు తెలిపాడు.

మ్యాచ్ లు, సిరీస్ లు గెలిచినప్పుడు మరియు మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఇచ్చే బోనస్ విషయంలో కూడా కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లే అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ప్రపంచ క్రికెట్ లో అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేశం భారత్, కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాలు వారి ఆటగాళ్లకు చెల్లిస్తున్న వాటితో పాలిస్తే మాకు ఇచ్చేది చాలా తక్కువే అని అన్నాడు. స్టీవ్ స్మిత్, వార్నర్, రూట్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో పోల్చితే తమకు వచ్చేది తక్కువని, వారికి బోర్డు కాంట్రాక్టుతో వచ్చే జీతం, మ్యాచ్ పీజులు కలిపి ఏడాదికి 10 -12 కోట్ల వరకు సంపాదిస్తారని కానీ ' ఏ ' గ్రేడ్ ఉన్న భారత ఆటగాళ్లు ఏడాదిలో 4-5 కోట్ల వరకు వస్తుందని కోహ్లీ అన్నాడు.

ఆదాయం భారీగా వస్తుంది కాబట్టి ఆదే స్థాయిలో జీతాలు ఉండాలని కోహ్లీ డిమాండ్ చేస్తున్నాడు. ఆటగాళ్ల సంఘం ఏర్పాటు చేయాలన్న లోధా కమిటీ సిఫారసుల ప్రకారం త్వరలోనే కుంబ్లే, కోహ్లీ, అశ్విన్ తదితరులతో కూడిన ఓ సంఘం ఏర్పాటు చేసి దాని ద్వారా జీతాల పెంపుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని సమాచారం.