ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ కంటే టీమిండియా సారథి తాజాగా ముగిసిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ విరాట్ కోహ్లీకి ఎన్నో విషయాలు నేర్పి ఉంటుందని ఆయన అన్నాడు. పూర్తిగా కోహ్లీపైనే ఆధారపడడం వల్లే టీమిండియా ఓడిపోయిందని ఆయన చెప్పాడు.
`ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ మంచి క్రికెటర్. కానీ, బ్యాట్స్‌మెన్‌గా, సారథిగా రూట్ కంటే కోహ్లీ అత్యుత్తమం. హాఫ్ సెంచరీలను శతకాలుగా ఎలా మార్చాలో కోహ్లీకే తెలుసు. అన్ని ఫార్మాట్లలోనూ 50కిపైగా సగటు కలిగి ఉండడం సామాన్యమైన విషయం కాదు. జట్టు సమష్టిగా రాణించి ఉంటే టీమిండియా కచ్చితంగా గెలిచి ఉండేది.
ఈ మ్యాచ్‌లో టయిలెండర్లతో కోహ్లీ పోరాడిన తీరు అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీకి ఎదురుపడడడానికి మిగిలిన ఆటగాళ్లు సిగ్గుపడి ఉంటార`ని మైక్ బ్రియర్లీ అన్నాడు.