//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పేస్ బుక్ లో మోడీ తర్వాత క్రేజ్ కోహ్లీకే !

Category : sports

పేస్ బుక్ లో భారతీయులలో ప్రధాని  నరేంద్ర మోడీ తరువాత క్రేజ్ ఎక్కువగా ఉన్నది టీమిండియా కెప్టెన్ విరాట్  కోహ్లీకి మాత్రమే. అత్యధికంగా పేస్ బుక్ లో ఫాలోవర్స్ ఉన్న భారతీయ క్రీడాకారుడుగా  కోహ్లీ ఎదిగారు. ఇప్పటి వరకు పేస్ బుక్ లో మోడీ తరువాత అత్యధికంగా అభిమానులు ఉన్న బాలీవడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కూడా కోహ్లీ అధిగమించారు. 

పేస్ బుక్ లో మోడీ కి 4.22 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండగా, కోహ్లీ కి 3.5 కోట్ల మంది ఉన్నారు. మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తో వివాదం ఏర్పడడంతో సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు, నిరసనలకు కోహ్లీ గురవుతున్నా ఆయన పాపులారిటీ మాత్రం  పెరుగుతూ ఉండటం గమనార్హం. "ఇదంతా మేము ఫీల్డ్ లో చేసే కృషి ఫలితం. మా శ్రమ ప్రజలకు ఇష్టం కలిగిస్తే దానంతటికదే  అభిమానంగా మారుతుంది" అని అన్నారు. 

సల్మాన్ ఖాన్ కన్నా ఆరు లక్షల మంది ఎక్కువగా ఫాలోవర్స్  ఉండడంతో దేశంలో అత్యధికంగా క్రేజ్ గల సెలబ్రిటీ గా కూడా ఎదిగిన్నట్లు అయింది. పేస్ బుక్ లోనే కాకుండా ట్విట్టర్ లో 1.60 కోట్ల మంది, ఇన్ స్ట్రాగ్రామ్ లో 1.40 కోట్ల మంది ఫాలోవర్స్ కోహ్లీకి ఉన్నారు. సోషల్ మీడియా లో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెట్ క్రికెటర్ గా చెప్పవచ్చు.