//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పట్టుబట్టి రవిశాస్త్రిని కోచ్ చేసిన కోహ్లీ !

Category : sports

ఎట్టకేలకు టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా ర‌విశాస్త్రిని బీసీసీఐ నియ‌మించింది. 2019 వ‌రల్డ్‌క‌ప్ వ‌ర‌కు ర‌విశాస్త్రియే కోచ్‌గా కొన‌సాగ‌నున్నాడు. గత ఏడాది తన మాట లెక్కచేయకుండా అనిల్ కుంబ్లే ను ఎంపిక చేయడంతో ఆగ్రహించిన టీమిండియా క్యాపిటన్ విరాట్ కోహ్లీ పట్టు బట్టి మరి కుంబ్లే ను సాగనంపి, అసలు దరఖాస్తు చేసుకొని శాస్త్రిని కోచ్ గా ఎంపిక చేయించారు. 

గంగూలీ నేతృత్వంలోని ముగ్గురు స‌భ్యుల క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ రవిశాస్త్రిని అనూహ్య పరిణామాల అనంతరం కోచ్‌గా ప్ర‌క‌టించింది. కోచ్ పదవికి అసలు దరఖాస్తు చేసుకోని శాస్త్రి కోసం అందుకు గడువు పొడిగించడం, తనను ఎంపిక చేస్తానంటేనే దరఖాస్తు చేస్తానని మంకుపట్టు పట్టి మరి సాధించుకోవడం గమనిస్తే బీసీసీఐ ఆట మీద కన్నా ఇతరత్రా ప్రభావాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. 

 సోమ‌వార‌మే కోచ్ కోసం ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించిన క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ త‌మ‌కు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని అడిగింది. కానీ ఆశ్చర్యకర రీతిలో  మంగ‌ళ‌వారం సాయంత్రంలోగా కొత్త కోచ్ పేరును ప్ర‌క‌టించాల్సిందేన‌ని సీఓఏ హెడ్ వినోద్ రాయ్ బోర్డుకు స్ప‌ష్టంచేయ‌డంతో ర‌విశాస్త్రి పేరును హ‌డావిడిగా ప్ర‌క‌టించారు. 

కొత్త కోచ్ ఎంపిక విష‌యంలో విరాట్  ఇండియా వ‌చ్చిన త‌ర్వాత అత‌నితో మాట్లాడి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఏసీ చీఫ్ సౌర‌వ్ గంగూలీ మంగళవారం ఉదయం కూడా చెప్పడం గమనార్హం.  ర‌విని కాద‌ని సెహ్వాగ్‌ను తీసుకురావ‌డానికి గంగూలీ ప్ర‌య‌త్నించినా కోహ్లీ సాగనీయ లేదు. 

ఇండియా త‌ర‌ఫున 80 టెస్టులు, 150 వ‌న్డేలు ఆడిన రవిశాస్త్రి గ‌తంలో 18 నెల‌లు టీమ్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో ఇండియా వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌తోపాటు ఐదు వ‌రుస టోర్నీల్లో సెమీస్ చేరింది. టెస్టుల్లో నంబ‌ర్ వ‌న్ ర్యాంకును తిరిగి అందుకున్న‌ది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది.