//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో పాకిస్థాన్ లో కోహ్లీ, ధోని ఆట !

Category : sports

భారత క్రికెటర్లు పాకిస్థాన్ లో ఆడి తొమ్మిది సంవత్సరాలయింది. 2008లో పాకిస్థాన్ లో జరిగిన ఆసియా కప్ పోటీల్లో పాల్గొన్న భారత జట్టు ఆ తరువాత పాకిస్థాన్ లో ఆడనే లేదు. 2009లో పాకిస్థాన్ లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టు  క్రీడాకారుల బస్సు పై ఉగ్రవాదుల దాడి జరగడంతో అప్పటి నుండి విదేశీ క్రికెట్  జట్లు ఏవీ పాకిస్థాన్ లో ఆడటం లేదు. కేవలం రెండేళ్ల క్రితం జింబాబ్వే జట్టు పాకిస్థాన్ లో పర్యటించింది.

పాకిస్థాన్ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో ఆడడానికి విదేశాలలో పర్యటించడం మినహా తమ దేశానికి మాత్రం ఎవరిని ఆహ్వానించడం లేదు. విదేశాలలో పాకిస్థాన్ జట్లతో భారత్ క్రీడాకారులు ఆడటానికి తమకు అభ్యంతరం లేదు గాని, భారత్, పాకిస్థాన్ లలో రెండు దేశాల జట్లు కలసి ఆడే ప్రసక్తి లేదనై కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ కూడా స్పష్టం చేయడం గమనార్హం. 

అయితే గతవారం ఇంగ్లాండ్ లో ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ ని భారత్ జట్టుపై గెలుపొంది పాకిస్థాన్ కైవసం చేసుకోవడంతో అప్పటి నుండి ఐసీసీ ద్రుష్టి పాకిస్థాన్ పై పడింది. పాకిస్థాన్ లో అంతర్జాతీయ క్రీడాకారులు ఆడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 

ఐసీసీ వర్గాల కధనం ప్రకారం ప్రపంచ జట్టు - పాకిస్థాన్ జట్ల మధ్య టి20 ఆటలు మూడు పాకిస్థాన్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనుకున్న విధంగా జరిగితే సెప్టెంబర్ లో కార్యరూపం ధరించే అవకాశం ఉంది. రెండు దేశాల ప్రభుత్వాలు అభ్యంతరాలు చెప్పని పక్షంలో భారత క్రీడాకారులు కనీసం ఇద్దరు అంతర్జాతీయ జట్టులో  ఉంటారు. బహుశా విరాట్ కోహ్లీ, యం యస్ ధోని ఈ జట్టుతో పాటు పాకిస్థాన్ లో  ఆడే అవకాశం ఏర్పడవచ్చు.