అంతర్జాతీయ క్రికెట్ లో మరో సంచలనం నమోదు అయింది. దిగ్గజ ఆటగాళ్ళు సైతం సాధించలేని రికార్డ్ ని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన పేరున లిఖించుకున్నాడు. 5 వన్డేల సీరీస్ లో భాగంగా విండీస్ తో విశాఖ వేదికగా బుధవారం జరుగుతున్న రెండో వన్డేలో చెలరేగి ఆడుతున్న కోహ్లి సెంచరి సాధించాడు. ఈ క్రమంలోనే 82 పరుగుల వద్ద సరికొత్త రికార్డ్ నమోదు చేసాడు. కేవలం 213 వన్డేల్లో 10,000 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే సెంచరి కూడా సాధించాడు. వన్డేలలో ఇప్పటి వరకు కోహ్లి 37 సెంచరీలు సాధించగా మొత్తం సాధించిన సెంచరీలు 61 కావడం విశేషం.
పదివేల పరుగుల వీరులు
* విరాట్ కోహ్లీ (213 వన్డేలు- భారత్)
* సచిన్ తెందుల్కర్ (266- భారత్)
* సౌరవ్ గంగూలీ (272- భారత్)
* రికీ పాంటింగ్ (272- ఆస్ట్రేలియా)
* జాక్వెస్ కలిస్ (286- దక్షిణాఫ్రికా)
* బ్రియన్ లారా (287- వెస్టిండీస్)
* రాహుల్ ద్రవిడ్ (309- భారత్)