//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Category : sports

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో సఫారీలు విజృంభించి భారత్ సరీస్ ఆశలను ఆలస్యం చేశారు. భారత్ జట్టు భారీ స్కోరు చేసినా విజయం ముందు బోల్తా పడింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్‌కు ఇది ఎదురుదెబ్బ కాగా, సిరీస్‌ను అడ్డుకోవాలన్న సౌతాఫ్రికాకు ఈ విజయం ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే భారత జట్టు ఓటమికి కారణమైన అంశాలే సఫారీల విజయానికి దోహదం చేశాయి.

భారత బ్యాటింగ్ జోరుగా సాగుతున్న సమయంలో వర్షం పడడంతో భారత్ స్కోరు 289 పరుగుల వద్ద ఆగిపోయింది. లేదంటే 320 పైచిలుకు పరుగులు వచ్చి ఉండేవి. తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లోనూ వర్షం పడడం వల్ల ఫలితం డక్‌వర్త్ లూయిస్‌లోకి మారింది. ఇక డేవిడ్ మిల్లర్‌‌కు రెండు సార్లు లైఫ్ ఇవ్వడం భారత జట్టు విజయంపై తీవ్ర ప్రభావం చూపించింది.

ఇదే విషయాన్ని అంగీకరించిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. డివిలియర్స్ అవుటైన తర్వాత గెలుపు తమదేనని భావించినట్టు చెప్పాడు. అయితే మిల్లర్-క్లాసెన్‌లు సమయోచితంగా ఆడి తమ నుంచి విజయాన్ని లాగేసుకున్నారని పేర్కొన్నాడు. ఇక చాహల్ బౌలింగ్‌లో రెండుసార్లు మిల్లర్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ స్క్వేర్‌లెగ్‌లో శ్రేయాస్ అయ్యర్ జారవిడిస్తే, అదే ఓవర్‌లో మిల్లర్ బౌల్డ్ అయినా అది నోబాల్ కావడంతో మరోమారు బతికిపోయాడు. తమ ఓటమికి ఇది కూడా ఓ కారణమని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక వర్షం కూడా తమ విజయాన్ని అడ్డుకుందని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే, పోర్ట్ ఎలిజబెత్‌లో మంగళవారం జరిగే ఐదో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంటామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.

Related News