దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన వన్డే కెరీర్లో మరోసెంచరీని సాధించాడు.ఇది తన వన్డే కెరీర్లో 33వ సెంచరీ.తన ఆట తీరుతో ఇండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. కఠినమైన పిచ్ పై కోహ్లీ ఆడిన తీరుపట్ల అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
మరోవైపు తన భర్త అద్భుత ఇన్నింగ్స్ కు కొత్త పెళ్లికూతురు అనుష్క శర్మ ఫిదా అయింది. తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సెంచరీ సాధించిన తర్వాత కోహ్లీ ఫొటోను పెట్టి దానిపై వాట్ ఏ గయ్ అని రాసింది.