ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. టెస్టుల్లో అతనికిది 17వ సెంచరీ. అంతేకాదు కెప్టెన్‌గా అతనికిది పదో సెంచరీ.
ఇప్పటివరకు 9 సెంచరీలతో అజారుద్దీన్ పేరిట ఉన్న రికార్డును విరాట్ అధిగమించాడు. కేవలం 44 ఇన్నింగ్స్‌లోనే కెప్టెన్‌గా పదో సెంచరీ చేశాడు విరాట్. ఇప్పుడు టెస్టుల్లో అతని సగటు కూడా 50 దాటడం విశేషం. అజర్ కెప్టెన్‌గా 68 ఇన్నింగ్స్‌లో 9 సెంచరీలు చేశాడు.
ఇక కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన గవాస్కర్ కంటే కేవలం ఒక సెంచరీ వెనుకబడి ఉన్నాడు విరాట్. సన్నీ మొత్తం 34 టెస్ట్ సెంచరీలు చేయగా అందులో 11 కెప్టెన్‌గా ఉన్నపుడు చేశాడు.
ఇక కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌లో పది సెంచరీలు చేసిన వారి జాబితాలో విరాట్ ఐదోస్థానంలో ఉన్నాడు. బ్రాడ్‌మన్ 26 ఇన్నింగ్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. జయవర్దనె (36 ఇన్నింగ్స్), స్టీవ్ స్మిత్ (37 ఇన్నింగ్స్), స్టీవ్ వా (43 ఇన్నింగ్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.