//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Category : politics

గతంలో ఆంధ్రపప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపి దాదాపు 20 కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని చేర్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే పార్టీలో వారిని సంతృప్తి పరిచి వారిని పార్టీలోకి అయితే తీసుకున్నారు కాని రోజు ఎక్కడో ఒక చోట పార్టీ లోకి వచ్చిన ఇతర పార్టీ నేతల వల్ల తలనోప్పితప్పడం లేదు. ముందు నుండి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత తగ్గుతుందు అనే ఉద్దేశ్యంతో వారు ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా వైకాపా ఎమ్మెల్యేగా గెలిచి తదుపరి తెలుగుదేశం పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కోడుమూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన, తమ వర్గానికి చెందిన సభ్యత్వ కార్డులను విష్ణు అనుచరులు దొంగిలించారని ఆరోపించారు.

సభ్యత్వ నమోదు కోసం రూ.13.50 లక్షలు చెల్లిస్తే ఇప్పటికీ తనకు, తన కార్యకర్తలకు వాటిని ఇవ్వలేదన్నారు. అబద్ధాలు ఆడాల్సిన అవసరం తనకు లేదని.. తాను టీడీపీకి అమ్ముడుపోయానని ఆత్మసాక్షిగా చెబుతున్నానని మణిగాంధీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే టీడీపీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారని, అయితే వాళ్లలా తాను అబద్ధాలు చెప్పలేనని అన్నారు.

ఆరు నెలల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని, అంతవరకు ఓపికపట్టాలని పేర్కొన్నారు. ఏ పార్టీలో ఎవరుంటారో అర్థంగాని పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. అంతేకాదు బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు త్వరలో టీడీపీ నుంచి బయటకు రానున్నట్టు తెలియజేశారు.

రాజకీయాల నుంచైనా తప్పుకుంటాను కానీ విష్ణువర్ధన్‌రెడ్డితో రాజీ పడే సమస్యే లేదని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. విష్ణువర్ధన్‌రెడ్డితో రాజీ కావాలని వర్ల రామయ్య, ఇన్‌చార్జీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనను బతిమిలాడినా లెక్క చేయలేదన్నారు. వైకాపా తరఫున పోటీచేసిన తనకు సీఎం చంద్రబాబుకంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.