//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనగామ బరిలో కోదండ రామ్... పొన్నాలకు టచ్ లో హరీష్

Category : politics

కాంగ్రెస్ పార్టీ లో పొన్నాలకు చెక్ ప్పెడుతున్నారు. అందుకే జనగామ నుండి పొత్తులలో భాగం గా టీజేఎస్ కు అవకాశం ఇవ్వనున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ జనగామ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జనగామ సీటును ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోదండరామ్ కు కేటాయించినట్లు సమాచారం. అక్కడి నుంచి పోటీ చేయడానికి కోదండరామ్ కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.Kodandaram in janagama Race

జనగామ జిల్లా ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. అక్కడ ఆయనకు మంచి పట్టు ఉంది. ఆ పోరాటానికి తలొగ్గి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జనగామ జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. కోదండరామ్ పోటీ చేస్తే జనగామలో ప్రజా కూటమికి ప్లస్ అవుతుందని భావిస్తున్న నేపధ్యంలో ఆ స్థానం ఆయనకు కేటాయించారని తెలుస్తుంది.ప్రస్తుతం జనగామ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. Kodandaram in janagama Race

కాబట్టి ఆ వ్యతిరేఖత, కోదండరాం కు ఉన్న ఇమేజ్ రెండు ప్లస్ అయ్యి అక్కడ విజయం ఖాయం అన్న భావనలోనే ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వనున్నారు. అయితే దీన్ని పొన్నాల తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెసు నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనకు కనీసం చెప్పకుండా కోదండరామ్ పేరును ఖరారు చేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. బీసీలకు ఇది తీరని అన్యాయమని ఆయన అంటున్నారు. జనగామ నుంచి పోటీ చేయాలని పొన్నాల లక్ష్మయ్య గట్టిగా అనుకుంటున్నారు. పొన్నాలకు హరీష్ టచ్ లోకి వెళ్ళారని తెలుస్తుంది. రాహుల్ గాంధీ జనగామ టికెట్ ను ఖరారు చెయ్యకుంటే పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్ లో చేరుతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. Kodandaram in janagama Race

అయితే, పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెసు అధిష్టానం మరో ఆఫర్ ఇస్తోంది. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి డిప్యూటీ సిఎం పదవి ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. లేదా రాజ్యసభ ఎంపిక చేయిస్తామని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది.ఇదిలావుంటే, టీజెఎస్ కాంగ్రెసు గుర్తు హస్తంపై పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. టీజెఎస్ కు ఎన్నికల సంఘం అగ్గిపెట్టె గుర్తును కేటాయించింది. ఓటర్లు అయోమయానికి గురవుతారనే హస్తం గుర్తుపై పోటీ చేసే అవకాశం వుంది.Kodandaram in janagama Race

Related News