//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టెన్త్ క్లాస్ లోనే ప్రేమాయణం మొదలు పెట్టిన కియారా అద్వానీ....ఆ తరువాత ఇంట్లో తెలియడం తో బ్రేకప్ చెప్పిందట... లేకపోతెనా...?

Category : movies

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ కియారా అద్వానీ.తన తొలి తెలుగు సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల కు ఎంతో చేరువైన ఈ భామ. తనదైన అంద చందాలతో తెలుగు ఆడియెన్స్ ను ఫిదా చేసింది.ఈ సినిమా తరువాత ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన " వినయ విధేయ రామ " సినిమాలో నటించి మెప్పించింది.కానీ ఈ సినిమా తాను ఆశించిన స్థాయిలో విజయం సాధించాక పోవడంతో తిరిగి బాలీవుడ్ బాట పట్టింది.ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కియరాకు మాత్రం అవకాశాల వరద మాత్రం ఆగటం లేదు. కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ టాప్ హీరోలతో నటించడం కారణంగా ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఈ అమ్మడు తెలుగులో నటించినవి రెండు సినిమాలే అయిన తెలుగు లో ఈ అమ్మడు కి మంచి పేరు దక్కింది.ఇది ఇలా ఉంటే కేవలం కియరా అభినయం తోనే కాదు....తనలో హాట్ నెస్ డోస్ పెంచడం లోనూ తనకు తానే సాటి అని చెప్పవచ్చు.

ఈ మధ్య కియారా లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను కిర్రెక్కించింది.ఈ వెబ్ సిరీస్ సెల్ఫ్ గా సెక్సువల్ ఫీలింగ్స్ తో ఎంజాయ్ చేసే యువతిగా కియారా ఔరా అనిపించింది. ఇక ఈ ముద్దు గుమ్మ తాజగా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన "అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్ "కబీర్ సింగ్" లో నటిస్తోంది. కావల్సినంత రొమాన్స్ కి తావుండే క్యారెక్టర్ కావడంతో ఈ సినిమాలో కియారా ఏ లెవల్ లో నటించి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విచ్చల విడి రొమాన్స్ కి స్కోప్ ఉండే పాత్ర కావడంతో ఈ పాత్రలో కియార ఖచ్చితంగా ఇరగ దీసే ఉంటుందని బాలీవుడ్ ప్రేక్షకుల అభిప్రాయం. ఒరిజినల్ అర్జున్ రెడ్డి తీసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెర కేక్కడం విశేషం. ఇందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు రెచ్చిపోయి ముద్దులు పెట్టుకోవడం బాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 21 వ తేదీన ఈ సినిమా హిందీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే కబీర్ సింగ్ విడుదలకు సిద్ధం కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర యూనిట్ పాల్గొన్నది.ఈ సంధర్బంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం గా కీయార అద్వానీ స్పందిస్తూ....ఓ ఆసక్తి కరమైన విషయాన్ని చెప్పుకొచ్చింది. తన పదో తరగతి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. తాను 10వ తరగతిలో ఉన్న సమయంలో ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని అప్పట్లో ఆ అబ్బాయి అంటే పడి చచ్చి పోయె దాన్ని అని పేర్కొంటూ...తన ప్రేమలో ఎన్నో ట్విస్టులు, మరొన్నో ఆసక్తికర విషయాలు జరిగాయి అని కియారా చెప్పుకొచ్చింది. ఇక ''పదో తరగతిలో నా ప్రేమ సంగతి తెలుసుకున్న మా అమ్మ తనకు గట్టి క్లాస్ తీసుకుందని. ముందు చదువుపై దృష్టి పెట్టమంటూ కోపంగా మందలించడంతో . ఆ వయసులో అలాంటి పనులు కరెక్ట్ కాదని చెప్పడంతో అతినితో బ్రేకప్ చేసుకోవాల్సి వచ్చిందని . అలా చిన్నప్పుడే తన లవ్ స్టోరీ కి ఎండ్ కార్డ్ పడిందని .. ఇక ఇప్పుడు లవ్ చేద్దామన్నా సమయం లేదంటూ '' పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది కియారా.