కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మూసివేసిన రోజుకు, మాల్యా చెల్లించవలసిన జీత భత్యాలు దాదాపు 300 కోట్ల రూపాయల పైనే 3000 మంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు, వారికి రావలసిన ఫ్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుఇటి వంటి సౌకర్యాలు మొత్తం కోల్పోయారు. 2016 మార్చి నెలలో విజయ్ మాల్యా ఇండియా వదలి వెళ్లిపోయే ముందు తాను ఎవరికి జీతాలు చెల్లించలేనని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వం తమకు రావలసిన 9000 కోట్ల బకాయిల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఉద్యోగస్తులకు చెల్లించవలసిన 300 కోట్ల గురించి పట్టించుకునే నాధుడే లేడని వారి ఆవేదన.