//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కింగ్ నాగార్జున బాలీవుడ్ రీఎంట్రీ ...!

Category : movies

అక్కినేని నవ మన్మధుడు కింగ్ నాగార్జున మళ్ళీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చాల కాలం తరువాత అయన మళ్ళీ బాలీవుడ్ సినిమాలో నటించాడని ఒప్పుకున్నారు. అదికూడా నేషనల్ స్టార్ బిగ్ బి అమితాబ్ తో కలిసి తెరను పంచుకోబోతున్నాడు.

కరణ్ జోహర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తీస్తున్న బ్రహ్మస్త్ర చిత్రం లో ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లోబిజీ గా ఉంది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతుంది.

ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో అమితాబ్‌ బచ్చన్‌ తో పాటుగా రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ తదితరులు నటిస్తున్నారు. ఖుదా గవా, క్రిమినల్‌, జక్మ్ లాంటి హిందీ చిత్రాల్లో నటించిన కింగ్ 2003లోఎల్‌వోసీ కార్గిల్‌ చిత్రంలో చివరిసారి హిందీ సినిమాలో నటించారు. ఆ సినిమా తరువాత నాగార్జున మళ్లీ బాలీవుడ్ లో నటించలేదు. మళ్ళీ దాదాపుగా 15 ఏళ్ల తర్వాత నాగార్జున మళ్ళీ హిందీ సినిమాలో నటిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

ఇప్పుడు నాగార్జున టాలీవుడ్ లో నానితో కలిసి దేవదాస్‌ అనే మల్టీస్టారర్ చిత్రం లో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.