అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్ధం అనివార్యమా అదే నిజమైతే యుద్ధానికి సిద్ధమైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మిత్రదేశంగా సిరియాను రంగంలోకి దించబోతున్నారా ఇరు దేశాల అధ్యక్షులు పరస్పరం సమాచారాన్ని అందించుకుంటున్నారా ఇరుదేశాల సైన్యాలు సంయుక్తంగా అమెరికాపై దాడి చేయనున్నాయా అంటే నిజమనే అంటోంది ఉత్తరకొరియాకు చెందిన ఓ పత్రిక.
అమెరికా, ఉత్తరకొరియాకి మధ్య యుద్ధం జరగనున్న నేపథ్యంలో కిమ్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఇరువురూ దగ్గరవుతున్నారని, వీరిద్దరూ లేఖల ద్వారా సమాచారాన్ని పంచుకున్నారని పత్రిక పేర్కొంది. సిరియాలో జరిగిన రసాయన దాడులను సమర్థిస్తూ, రెండవసారి అధ్యక్షుడు అయ్యారంటే ప్రజల మద్ధతు ఉందంటూ అసద్‌ను మెచ్చుకుంటూ కిమ్ మొదట లేఖ రాశారని, స్పందించిన బషర్ కిమ్‌కు లేఖ ద్వారా బదులిచ్చారని ఉత్తరకొరియా సైన్యాన్ని, అణుపరీక్షలను ఆయన మెచ్చుకున్నారని పత్రిక పేర్కొంది. దీంతో ఉత్తరకొరియాపై అమెరికా దాడికి పాల్పడితే కిమ్‌కు మద్ధతుగా బషర్ యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పత్రిక పేర్కొంది.