//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ పని చేస్తుండగా వీడియో తీసి ..

Category : national

మన దేశం లో పలు నగరాల్లో కొందరు యువకులు కదులుతున్న రైలు నుంచి కిందికి దిగి... ఫ్లాట్‌ఫామ్‌పై డ్యాన్స్ వేసి మళ్లీ రైలెక్కారు. ఇది అత్యంత ప్రమాదకరమని తెలిసినా డోంట్ కేర్ అంటున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని విరార్‌ ప్రాంతంలో జరిగింది. కికి ఛాలెంజ్‌ను ఎవరు ప్రారంభించారో తెలియదుగానీ... ఇది మరింత విస్తృతమవుతోంది. కికి ఛాలెంజ్‌ను స్వీకరిస్తే అరదండాలు తప్పవంటూ పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నా యువత మాత్రం ఏమాత్రం లెక్క చెయ్యకుండా అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా, ఈ భయంకరమైన ఛాలంజ్ నిన్నామొన్నటివరకు కారుకే పరిమితమైన ఈ కికి ఛాలెంజ్.. ఇపుడు రైలు వరకు పాకింది.

ఈ ప్రాంతానికి చెందిన నిషాంత్‌ షా(20), ధ్రువ్‌ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు రైలుతో కికి చాలెంజ్ చేశారు. కదులుతున్న రైలు నుంచి ప్లాట్‌ఫాంపైకి దూకిన వీరు డ్యాన్స్‌లు చేసి, మళ్లీ రైలెక్కారు. పైగా, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇవి అలా అలా తిరిగి పోలీసులకు చేరాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారించిన కోర్టు వీరు ముగ్గురు కికి డ్యాన్స్ చేసిన విసాయ్ రైల్వే స్టేషన్‌ను వారానికి మూడుసార్లు శుభ్రం చేయాలని ఆదేశించింది.

అంతేకాదు, శిక్షలో భాగంగా వారు స్టేషన్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు వీడియో తీసి దానిని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ వీడియోలను చూసిన తర్వాత ఇంకా ఏదైనా శిక్ష వేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టంచేసింది.