Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సచిన్ కూతుర్ని కిడ్నాప్ చేస్తా !

Category : world sports

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ను కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డ ఓ యువకుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలు .. పశ్చిమబెంగాల్ మిద్నాపూర్ కు చెందిన ముప్పై రెండు సంవత్సరాలు దేవ్ కుమార్ మిత్తి తన చదువును మధ్యలోనే ఆపేశాడు. పనీపాటా లేకుండా ఉంటున్న ఇతను, గత నెల చివరి వారంలో సచిన్ ఇంటికి ఫోన్ చేసి సారాను కిడ్నాప్ చేస్తానని, ఆమెను పెళ్లి చేసుకుంటానని బెదిరించినట్టు సమాచారం.

ఈ విషయమై సచిన్ సహాయకులు ఒకరు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా అతను నివసించే ప్రాంతాన్ని పోలీసులు తెలుసుకుని నిన్న ఉదయం అరెస్టు చేశారు. కాగా, సారా టెండూల్కర్ ను చాలాసార్లు టెలివిజన్ లో చూశానని, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని పోలీసులకు చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇదిలా ఉండగా, సచిన్ కుమార్తె సారా తన చదువు నిమిత్తం విదేశాల్లో ఉన్నారు.