జకార్తాలో జరిగిన ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జపాన్ ఆటగాడు కజుమాసా సకాయ్తో తలపడిన శ్రీకాంత్ రెండు వరుస సెట్లలో విజయం సాధించాడు. శ్రీకాంత్‌కి ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్ కావడం గమనార్హం.
13నిమిషాల్లోనే తొలి సెట్‌ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్‌కు రెండో సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో వెనుకబడిన శ్రీకాంత్ ఆ తర్వాత తేరుకుని సుకాయ్‌పై విజృంభించాడు.
తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో గట్టి పోటీ ఎదురైంది. 19-19 వరకు స్కోరు సమంగానే ఉంది. అయితే అసలు సమయంలో రెండు వరుస పాయింట్లు సాధించి టైటిల్ గెలిచాడు శ్రీకాంత్. దీంతో హోరాహోరీగా సాగిన రెండో సెట్‌ను శ్రీకాంత్ 21-19తో గెలిచి ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు.