Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

KGF ట్రైలర్ 2 : మోన్స్టర్ భీభత్సము మాములుగా లేదు

Category : movies

KGF ఈ సినిమా ట్రైలర్ బైటికి వచ్చే వరకు ఇలాంటి ఒక సినిమా సోత్ లో తెరకెక్కుతున్న విషయం కూడా ఎవ్వరికి తెలీదు. పెద్దగా ఎక్సపెక్టషన్స్ కూడా లేవు... ఒక్క కన్నడ ఇండస్ట్రీ లో తప్పా. కానీ ట్రైలర్ వచ్చాకా అది సృష్టించి సెన్సేషన్ మాములుగా లేదు... అందరి నోటా KGF , హీరో యాష్ పేరు మోతమోగిపోతుంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు మనలని మనం మరిచిపోయి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోతాం.

కంటెంట్ లో ఉన్న ఫీల్ కట్టిపడేస్తుంది.ఆ సాలిడ్ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవటం ఎవ్వరి తరం కాదు. అన్ని భాషల్లోనూ ఇదే హంగామా.. ఇప్పుడు ఎక్కడ చూసినా KGF సినిమా కోసమే చర్చా. మరో సారి ఇండియా మొత్తం మన సౌత్ సినిమా వైపు చూస్తుంది. రోజురోజుకి సౌత్ సినిమా హద్దులు చెరుపు కుంటూ చెలరిగిపోతుంది. ఇది గర్వించదగ్గ విషయం.రోబో సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ శంకర్ కెజిఎఫ్ సినిమా గురించి , హీరో యాష్ గురుంచి మాట్లాడాడంటేనే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. మొన్న రిలీజ్ చేసిన లిరికల్ వీడియో సాంగ్ వేడి ఇంకా తగ్గక ముందే సెకండ్ ట్రైలర్ తో టెంపరేచర్ మీటర్ ని బ్లాస్ట్ చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నిన్న సాయంత్రం విడుదలైన ఈ ట్రైలర్ చూసినా తరువాత KGF ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తదో... ఎప్పుడు చూడాలా... అన్న ఆత్రం పెరిగిపోతుంది. అసలు ఏమైనా ఉందా ట్రైలర్. జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంతే. రాకింగ్ స్టార్ యాష్ అప్పీరెన్స్ తో పిచ్చెక్కిస్తున్నాడు. ట్రైలర్ లో హీరోయిజం ఎలేవేటే చేసిన తీరు ఆమోఘం. యాష్ స్టైల్ చూస్తే ఏ మాస్ హీరో అయినా కుళ్ళు కోవటం ఖాయం. యాష్ తన పెర్ఫార్మన్స్ తో మ్యాజిక్ చేస్తున్నాడు.

ఆ మాయాజాలం లో పడిపోకుండా ఉండటం కష్టమైన పనే. యాష్ కి తల్లి గా చేసిన ఆమె మంచి అటెంషన్ తీసుకుంటుంది. ఆమె హీరోని మోటివేట్ చేసే తీరు బాగుంది. ట్రైలర్ చివర్లో వచ్చిన డైలాగ్ అతనంత పెద్ద గ్యాంగ్ స్టరా? అని ఎవరో అడిగితే... 'గ్యాంగ్ తో వచ్చే వాడు గ్యాంగ్ స్టర్.. కానీ అతనొక్కడే వస్తాడు.. మాన్స్టర్' మరొకరు అంటారు. ఆ సమయం లో యాష్ గన్ దాడిచేస్తూ నడుచుకుని వస్తుంటే టెర్రిఫిక్ గా ఉన్నాడు.

ఇంతకంటే హీరోయిజం ఎలివేషన్ ఇంకేముంటుంది చెప్పండి? ఈ మోన్స్టర్ సృష్టించే అలజడిని ఆపడం అసాధ్యంలనే ఉంది. కన్నడ హీరో ఉపేంద్ర తప్పా మారె హీరో తెలుగు మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయారు. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత యాష్ కి ఆ అవకాశం చిక్కింది. ట్రైలర్స్ తో యాష్ ఇక్కడ మాస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సినిమా విడుదలయ్యాక ఆ హుషారు మరో లెవెల్ లో ఉండబోతుంది. ఇండియా వైడ్ అతనికి ఫ్యాన్ బేస్ ఏర్పడటంలో సందేహం లేదు. డిసెంబర్ 21 న రిలీజ్ అవ్వుతున్న ఈ చిత్రం అదే రోజు రాబోతున్న తెలుగు సినిమాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Related News