Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కన్నడ సంచలనం "కెజిఎఫ్'' తెలుగు రాష్ట్రాల్లో కొల్లగొట్టిన వసూళ్లు ఇవే ...?

Category : movies

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన 'కెజిఎఫ్' ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే . ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకుపైగా వసూలు రాబట్టి చరిత్ర సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ కిరంగదూర్ నిర్మాత. 'కెజిఎఫ్' తెలుగు వెర్షన్ కూడా కన్నడతో పాటు రిలీజ్ చేశారు. డిసెంబర్ చివరి వారంలో విడుదలైన ఈ మూవీ థియేట్రికల్ రన్ దాదాపుగా క్లోజ్ అయింది. టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఈ మూవీ ఎంత వసూలు చేసింది...? డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభం తెచ్చిందో ఓ సారి చూద్దాం...!

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలకు కలిపి టోటల్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 12.30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కన్నడ డబ్బింగ్ చిత్రానికి తెలుగులో ఇంత షేర్ రావడం రికార్డుగా చెప్పుకుంటున్నారు.ఈ చిత్రాన్ని తెలుగు లో వారాహి చలన చిత్రం బేనర్లో సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ సినిమా తెలుగులో కేవలం 5 కోట్ల షేర్ కి సాయి కొర్రపాటి కొనడం జరిగింది...! ఈ కన్నడ డబ్బింగ్ మూవీకి పెట్టిన పెట్టుబడికి రెట్టింపుకు మించిన లాభం రావడంతో టాలీవుడ్లో కూడా బ్లాక్ బస్టర్‌గ హిట్ గా నిలిచింది.

కేజీ ఎఫ్ చిత్రం అన్ని ఏరియాల్లో కలుపుకుని కొల్లగొట్టిన కలెక్షన్స్ వివరాలు....నైజాంలో 4.80 కోట్లు, సీడెడ్ లో 2.40 కోట్లు, ఉత్తరాంధ్ర లో 1.45 కోట్లు, గుంటూరు లో 90 లక్షలు, ఈస్ట్ గోదావరి లో . 72 లక్షలు, వెస్ట్ గోదావరి లో 60 లక్షలు, కృష్ణ లో 1.60 కోట్లు, నెల్లూరు లో 30 లక్షలు రాబట్టి సంచల విజయం అందుకుంది.

మొదటి భాగమే ఈ లెవల్ లో రికార్డు సృష్టిస్తే ఇంకా కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదల తరువాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేయనుందో . ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని థియేట్రికల్ రైట్స్ ఒక అంచనా ప్రకారం 10 కోట్లకు మించి అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 చివరి వరకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Related News