Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన కేజిఎఫ్ దర్శకుడు....!

Category : movies

ఒకే ఒక్క కన్నడ చిత్రంతో యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టి నీ తనవైపు తిప్పుకున్నాడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా విడుదలకు ముందు వెనుక కేవలం వంద కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన ఒక్క కన్నడ సినిమా కూడా లేదు.ఈ సినిమా విడుదల తరువాత కన్నడ సినిమా మార్కెట్ ను దేశం నలువైపులా పరుగులు పెట్టించాడు ప్రశాంత్ నీల్.ఇది ఇలా ఉంటే ఈ సినిమా మొదటి భాగం తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అంతర్జాతీయ మార్కెట్ పెట్టిన ఈ సినిమా.... త్వరలో విడుదల కాబోయే రెండో భాగం తైవత ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.అయితే తాజగా ఈ చిత్ర దర్శకుడు పై ఓ ఆసక్తి కరమైన వార్త సంచలనంగా మారింది. కెజీఎఫ్ రెండో భాగం రిలీజ్ అనంతరం.ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది .

దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట . తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ కాంబో లో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా చిత్రీకరణకు పాల్గొంటున్నాడు . ఈ సినిమా కంప్లీట్ అవ్వ డానికి ఇంకో ఏడాది సమయం పడుతుండడంతో .... ఆ సినిమా పూర్తి చిత్రీకరణ అనంతరం ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఈ సినిమా రానుంది . ఈలోపు కేజీఎఫ్ 2 చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ఈ లెక్కన ఈ ఇద్దరి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గనక తెర పైకి వస్తె బాక్స్ లు బద్దలవ్వడం పక్కా అనే చెప్పుకోవాలి.

Related News