//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గన్ ఎక్కుపెట్టిన కేజ్రి సర్కారు

Category : national

గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీవాసులను ఇబ్బంది పెడుతున్న కాలుష్యం నివారణకు కేజ్రీవాల్ సర్కార్ సిద్ధమైంది.

ఈ నేపథ్యంలోనే కాలుష్యం నివారణకు కేజ్రీవాల్ సర్కార్ కొత్త పరికరాన్ని దించింది. గన్‌లాంటి ఒక ప్రత్యేక పరికరాన్ని తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వం.. దాంతో వివిధ ప్రాంతాల్లో ప్రయోగాలు చేయిస్తోంది. ఓ వాహనంపై ఉన్ననీటి ట్యాంక్‌కు అనుసంధానం చేసి ఈ గన్‌ను ఉపయోగిస్తారు.

నేరుగా గాల్లోకి ఈ గన్‌ను పేల్చడం ద్వారా అది కాస్త దాదాపు వర్షం కురిసినట్లుగా సన్నటి నీటి బిందువులను కురిపిస్తుంది. దీంతో దుమ్మూధూళి కణాలతో పేరుకుపోయిన పొగ కాస్త విడిపోయి మాయమయ్యేట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ గన్‌ను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పర్యవేక్షనలో ఢిల్లీలోని సెక్రటేరియట్‌ వద్ద పరీక్షించారు.

అక్కడ మంచి ఫలితాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరికరం దాదాపు రూ.20లక్షలు అవుతుందని, అన్ని చోట్లతో దీనిని ఉపయోగించడానికి ముందు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఈ సందర్భంగా సిసోడియా తెలిపారు. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఢిల్లీ కాలుష్యానికి చెక్ పడే సమయం వచ్చినట్లే, ఇంకా ఢిల్లీవాసులు ఉపిరి పీల్చుకోవచ్చనే చెప్పవచ్చు.