Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాక్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీ ......?

Category : national politics

ప్ర‌ధాని మోడి చెప్పేది ఓక‌టి ,చేసేది ఒక‌టి అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మ‌ధ్య‌నే జ‌రిగిన పుల్వామా దాడి గురించి మోడీ మ‌రిచిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు చెప్పిన సీఎం కేజ్రీవాల్..ప‌ఠాన్ కోట‌ను పాక్ నిఘా సంస్థ‌కు చూపించాడాన్ని త‌ప్పుబ‌ట్టారు.

గ‌తంలో జ‌రిగిన ప‌రిణామాల దృష్ట పాక్ అధికారుల‌ను భార‌త్ లోకి అనుమ‌తించ‌కూడ‌ద‌నే నిబంధ‌నను ప్ర‌ధాని మోడి విమ‌ర్శించార‌ని ,ఇలాంటి చర్య‌లు శ‌త్రు దేశానికి బ‌లాన్ని ఇచ్చేవిగా ఉంటాయ‌ని చెప్పుకొచ్చారు.పాక్ ప్ర‌ధానితో చ‌ర్చ‌లు జ‌రిపిన మోడీ ని ,ఇమ్రాన్ ఖాన్ మ‌ళ్లీ భార‌త ప్ర‌ధాని కావాల‌ని కోర‌డం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవ చేశారు.మోడి శైలి చూస్తుంటే పాక్ కు అనుకూలంగా వ్య వ‌హ‌రిస్తున్నార‌నే అనుమానాలు వ‌స్తున్నాయ‌ని ,దేశ భ‌ద్ర‌త ప్రధాని చేతుల‌లో ఉంటుంద‌ని ,అలాంటి వ్య‌క్తి ఇలాంటి నిబంధ‌న‌లు ఉల్లంగించ‌డం చాలా భాదాక‌ర‌మ‌ని సీఎం కేజ్రీవాల్ అన్నారు.

అయితే దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే ప‌నులు చేప‌డితే ప్ర‌జ‌లు ఊర‌కునే ప‌ర‌స్థితిలో లేర‌ని , రాబోయే ఎన్నిక‌ల‌లో మోడి ని ఓడించి ప్ర‌జ‌లు తగిన‌ గుణ‌పాఠం చెపుతార‌ని ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ‌నాయ‌కుల నుండి విన‌బ‌డుతున్న మాట‌లు .....అయితే ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేల మోడి ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం బీజేపీ కి కూడా న‌చ్చ‌లేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Related News