//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహానటుడికి జంటగా మహానటి...!

Category : movies

కీర్తి సురేష్ టాలీవుడ్ లో ఎప్పుడు ఈ పేరు సావిత్రిగా మారిపోయింది అంటే పెద్ద గా ఆచ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మహానటి చుసిన ప్రతి అభిమాని నోటి నుండి వచ్చే ఒకే ఒక మాట అచ్చు సావిత్రే దిగివచ్చింది. ‘మహానటి’తో ఎనలేని కీర్తిని సొంతం చేసుకుంది.

ఇప్పుడు మహానటి తర్వాత కీర్తి సురేష్ ఎటువంటి చిత్రం చేస్తుందనే దానిపై ఇప్పుడు ప్రత్యేకంగా చర్చలు జరుగుతున్నాయి. భారీ సంస్థల నుంచి కీర్తి సురేష్‌కు అవకాశాలు వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జయలలిత బయోపిక్, వంటి చిత్రాలలో కీర్తి సురేష్‌ నటించే అవకాశాలు ఉన్నాయని, చర్చలు జరుగుతున్నాయని ఇటీవల వార్తలు వినిపించాయి.

తాజాగా ఇలాంటిదే ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల మహానటి సినిమా చూసిన రాజమౌళి, సినిమాపై, కీర్తి సురేష్‌పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళి త్వరలో తెరకెక్కించబోయే భారీ మల్టీస్టారర్ మూవీలో ఒక హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తాజాగా వార్తలు సంచరిస్తున్నాయి. మరి నిజంగా ఈ వార్తలో ఎంత నిజముందో తెలియరావాలి.