Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో "వుమెన్ సెంట్రిక్" మూవీ లో కీర్తి సురేష్..?

Category : movies

ముద్దు గుమ్మా కీర్తి సురేష్ మహానటి తరువాత మరో వుమెన్ సెంట్రిక్ కాన్సెప్ట్ కు ఒకే చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యింది. ఏ మాత్రం తొందరపడకుండా కథలను ఎంచుకుంటున్న కీర్తికథను వినగానే ఒకే చేసింది. ఈ సినిమాలో ఎమోషన్ తో పాటు మంచి మెస్సేజ్ కూడా ఉంటుందట. ప్రస్తుతం సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

అయితే "మిస్ ఇండియా" అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఒకే చేసే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా నరేంద్ర పరిచయమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై నిర్మాత కంటే ఎక్కువగా కీర్తి నమ్మకం పెట్టుకుందట. ఈ అమ్మడుకు మహానటి తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలతో అవకాశం వచ్చినప్పటికీ కథ నచ్చక రిజెక్ట్ చేసిన లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో నాగార్జున సినిమా కూడా ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. ఇక ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ఎలా ఉంటదో వేచి చూడాలి.

దీనితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ఓ సినిమా చేస్తుంది. "బదాయి హో" ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేష్ నటించే ఛాన్స్‌ను కొట్టేసింది.