//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలీవుడ్ ప్రేక్షకులకు గ్లామర్ పంచ్ విసురుతున్న కీర్తి సురేష్....తాజగా ఆమె లుక్ చూస్తే మీకు షాకే.

Category : movies

'రోమ్ వెళితే రోమన్ లా ఉండాలన్న' సామెతను చాలా బాగా అనుకరిస్తున్న భామ కీర్తి సురేష్. "నేను శైలజా" సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. రీసెంట్ గా వచ్చిన "మహానటి" సావిత్రి సినిమాతో తెలుగు, తమిళం లో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది.ఇక వీలు చిక్కిన ప్రతి సారి కోలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తూ తనదైన నటనతో టాప్ హీరోయిన్ రేస్ లో నిలిచింది.ఇక కేవలం దక్షిణాది సినిమాలతోనే కాకుండా బాలీవుడ్ లోను ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. ఇందుకోసం ఈ అమ్మడు తన ఫిజిక్ లో కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చింది.బాలీవుడ్ లో అగ్ర కథానాయికలతో పోటీపడేందుకు గాను ఈ అమ్మడు భారీగా వెయిట్ లాస్ అయ్యి. ఈ నేపధ్యంలోనే ఈ అమ్మడు క్యూట్ గా స్లిమ్ లుక్ లో కనిపిస్తుంది. మహానటి సినిమా కోసం ఈ అమ్మడు ఆ మధ్య చాలా బొద్దుగా తయారైంది.కానీ ఈ మధ్య ఈ అమ్మడు జిమ్ లో భారీగా వర్కౌట్ చేసి సగానికి సగం వెయిట్ తగ్గడం విశేషం.ఈ లుక్ లో ఈ కీర్తిని చూస్తుంటే ..... కరెంట్ తీగలా సన్నగా... నాజూకుగా తయారైంది.

కేవలం లుక్ తోనే కాకుండా.. తనలోని అసాధారణ నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను సైతం కనువిందు చేయబోతోంది. అయితే బాలీవుడ్ ఆక్షన్ స్టార్ అజయ్ దేవగన్ పక్కన కీర్తి సురేష్ హీరోయిన్ గా ఓ భారీ చిత్రంలో నటించబోతుంది. ఈ మూవీ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే బయోపిక్ కావడం విశేషం. ఇక కీర్తి తన కెరియర్ గురించి మాట్లాడుతూ.. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని తనకుందని .. ఏదో ఒక జానర్కే పరిమితమయ్యే ఆలోచన తనకు లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె వెల్లడించింది. క్వీన్ సినిమాలో కంగనా రనౌత్ లాగా....ధనుష్ హీరోగా తెరకెక్కిన మరియన్ సినిమాలో పార్వతి వంటి వారు నటించిన పాత్రలు తనకు చేయాలనుందని ఆమె తెలిపింది. భవిష్యత్ గురించి పెద్దగా ఆలోచించను. కాలంతో ముందుకు వెళ్తుంటానని కీర్తి తెలిపింది. నరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది హీరోయిన్ ఓరయెంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.అలాగే నగేష్ కుకునూరు దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది కీర్తి.