//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ల‌వ్ మ్యారేజ్.. అసలు విష‌యం తేల్చేసిన‌.. కీర్తి సురేష్

Category : movies

టాలీవుడ్ తొలి బ‌యోపిక్ మహానటికి చిత్రంలో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు సైతం కీర్తి సురేష్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లను వసూలు చేసి దూసుకుపోతోంది. గత శుక్రవారం తమిళంలో నడిగైయార్ తిలగం అనే పేరుతో మహానటి విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన కీర్తి సురేష్ విలేఖరులు అడిగిన ప్రశ్నల పై త‌న‌దైన స‌మాధానాలు చెప్పింది.

ఇక సావిత్రిలా మంచినటిగా పేరు తెచ్చుకున్నారు క‌దా.. ఆమె జీవితంలో జరిగిన విధంగానే ప్రేమ పెళ్లి చేసుకుంటారా అని ప్ర‌శ్నించ‌గా.. ప్రేమ వివాహం గురించి మాట్లాడుతూ.. మా తల్లిదండ్రులది ప్రేమ వివాహమే. నేను ఇప్పుడే ప్రేమ పెళ్లి గురించి ఏమీ చెప్పలేను. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. భవిష్యత్తులో నేను ఎవరినైనా ప్రేమిస్తే, వెంటనే తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలనని... వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటానని కీర్తి క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా పై సినిమాల నిర్మాణం, దర్శకత్వం వహిస్తారా అని అడగ్గా.. మా అమ్మ మేనక, బామ్మ సరోజ హీరోయిన్స్ గా రాణించారు. అలాగే నా సోదరి పార్వతి సైతం సినిమా రంగంలోనే ఉంది. నాన్న నిర్మాత. సో నేను నిర్మాతగా మారను. దర్శకత్వం చేసేందుకు అర్హత, ప్రతిభ నాకు ఉన్నాయని అనుకోవడం లేదని వివరించింది.