//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ కొత్త బస్సు ఫెసిలిటీస్ ఏంటంటే ?

Category : politics

గతవారం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ బోర్డర్ లో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టలు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు చేసారు.ఈ నేపధ్యం లో తెలంగాణ సీఎం కు భద్రత పెంచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.

ప్రస్తుతం కెసిఆర్ పర్యటనలకు ఉపయోగించే బస్సు కు బదులుగా మరొక బస్సు ను ఆర్థిక శాఖ వారు రెడీ చేయిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ పర్యటనలకు వెళ్లేందుకు వాడుతున్న బుల్లెట్‌ఫ్రూఫ్ బస్సు ఖరీదు నాలుగు కోట్లు. ఈ బస్సు ను ఛండీగర్‌కు చెందిన జేసీపీఎల్ సంస్థ తయారుచేసింది.

తెలంగాణ సీఎం గా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి ఈ బస్సు ను వాడుతున్నారు.ఈ బస్సుతో పాటుగా, సీఎంకి మరింత మెరుగైన బుల్లెట్‌ఫ్రూఫ్ బస్సును కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

కొత్తగా కొనే బస్సులో ఇప్పుడు వినియోగిస్తున్న బస్సు కంటే ఎక్కువ భద్రతాపరమైన సదుపాయాలు ఉంటాయని సమాచారం. ఈ బస్సు ఖరీదు దాదాపుగా రూ.7కోట్లు ఉంటుందని సమాచారం. ఈ వాహనాన్ని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పర్యటనకు వినియోగిస్తారు. ఇప్పటికే ఈ బస్సు ఎలా ఉండాలనే దానిపై ఎనిమిది మందితో కూడిన కమిటీ ప్రణాళికలు రూపొందిస్తోంది. మరికొద్ది నెలల్లోనే సీఎం కేసీఆర్ కొత్త బస్సులో పర్యటించనున్నారు.

Related News