Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కెసిఆర్..

Category : state politics

తెలుగు ప్రజలందరికి సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు.మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లు ఇస్తామని ప్రకటించారు.భవిష్యత్ లో 5 వేల టీఎంసీల నీటిని ఏపీ, మరియు తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాలని తాము ఆలోచిస్తున్నామని..ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు.అలాగే తెలంగాణాలో కొత్త సెక్రటేరియట్‌ భవనాన్ని,అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ నెల 27న కొత్త సచివాలయం,అసెంబ్లీ భవనాలకు భూమి పూజ చేస్తామని తెలిపారు. సెక్రటేరియట్‌ భవనాన్ని ఉన్న చోటునే కట్టాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.5 నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ సచివాలయాన్ని నిర్మిస్తాం.రూ.400 కోట్ల వ్యయంలోపే సచివాలయం పూర్తవుతుంది.మరియు రూ.100 కోట్ల ఖర్చుతో అసెంబ్లీ పూర్తవుతుంది. ఇప్పుడున్న అసెంబ్లీని హెరిటేజ్‌ భవనంలా కాపాడుతాం అని మరియు తూర్పు ముఖంగా అసెంబ్లీ యొక్క నిర్మాణం చేపడతామని సీఎం కేసీఆర్ మీడియా ముందు స్పష్టం చేశారు

Related News