తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్, తెరాస పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 75 లక్షల మంది తెరాసలో సభ్యులుగా చేరారు. వీరు కట్టిన రుసుములు ద్వారా పార్టీ ఖాతాకు సుమారుగా 30 కోట్లు చేరినట్లు ఆయన ప్రకటించారు. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ఒక పథకం వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు ఆరు రోజులపాటు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ నెల14 నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు గులాబీ కూలీ దినాలుగా ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి వరకు అందరు కూలి చేసి వచ్చిన డబ్బుతో ఎంతో కొంత పార్టీకిచ్చి పార్టీ అభివృధికి పాటుపడాలని కోరారు. తనవంతుగా తాను కూడ ఒక రోజు కూలీగా పని చేసి వచ్చిన కూలి డబ్బులను ఫండ్ గా ఇస్తానని కే.సి.ఆర్ తెలిపారు. గ్రామస్థాయి కార్యకర్తలు కూడా తప్పని సరిగా కనీసం రెండురోజుల పాటు పని చేయాలని ఆయన కోరారు. 75 లక్షల మెంబర్లు కనీసం రెండురోజులు పని చేసి ఒక్కొక్కరు రోజుకు వంద రూపాయల చొప్పున కూలీ, పార్టీ ఫండ్ కు ఇస్తే ఎంత మొత్తం వసూలౌవుతుందో తెలుసా? 150 కోట్లు. అక్షరాల నూట యాభై కోట్ల రూపాయలు మాత్రమే అన్నమాట.