//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ పార్టీ లో.....మహిళలకు మంత్రి పదవులు...!

Category : state politics

ఇపుడు అందరి దృష్టి ఆ పదవులపైనే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే లుగా గెలిచిన ముఖ్య నేతలకు మంత్రి పదవులు ఎలాగూ ఖాయం. కాని అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన మహిళ నేతలకి మాత్రం ఏటువంటి పదవులు ఇవ్వనున్నరనేదే ఇపుడు కీలకం కానుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మహిళా నేతల సంఖ్య తక్కువగా ఉండడం. కేవలం ఇందులో పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌), గొంగిడి సునీత (ఆలేరు),

రేఖానాయక్‌ (ఖానాపూర్‌) ముగ్గురూ మాత్రమే ఉండడం విశేషం.

అయితే ఉన్న వారిలో నే వారికి మంచి పదవులు ఇచ్చి మహిళలను గౌరవించుకోవలనే చూస్తుంది.

ఈ రకంగా చూసుకుంటే ఇపుడు ఉన్న వారిలో వారికి ఏ మాత్రమ్

అవకాశం ఉన్నా అందరికీ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా పార్లమెంటరీ కార్యదర్శి పదవులు పొందడం కూడా

ఖాయం కాగానే ఉంది. అలాగే ఉపసభాపతి స్థానానికి సైతం వారిని దృష్టిలో పెట్టుకొని ఉన్నట్లు సమాచారం. గతంలో ఉప సభాపతి గా చేసిన అనుభవం ఉన్న పద్మా ఇపుడు మళ్లీ ఏ పదవి దక్క నుందో.

ఉద్యమ నేపథ్యం, శాసనసభ్యురాలిగా, ఉపసభాపతిగా అనుభవం ఆమెకు లాభించనుంది. సీఎం ఈసారి విధిగా మంత్రివర్గంలోకి ఒక మహిళను తీసుకోవాలి అని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ సమీకరణాలు మారితే ఎస్టీ, మహిళా కేటగిరీ లో రేఖా కి అమాత్య పదవి దక్కవచ్చని భావిస్తున్నారు.

కొందరు మహిళా సభ్యులు టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అలా చేరే వారికి కూడా కీలక పదవులు ఇస్తామని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆలోచనలో ఉంది. వారి చేరికలపై స్పష్టత వస్తే మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శుల పదవుల ఎంపిక వాయిదా పడవచ్చని కూడా సంచారం.