//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేవంత్ రెడ్డి ఇక అవుట్....?

Category : politics

తెలంగాణాలో తమ ప్రభుత్యాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నిలకకి తెరతీశారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ 2019 ఎన్నికలపైనే దృష్టిసారించాయి. మరోవైపు అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుంది.

పొత్తులతో మహాకూటమిని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకి చెక్‌ పెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు కెసిఆర్. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలపై ఉన్న పాత కేసులను కెసిఆర్ తిరగతోడుతున్నాడని ఊహాగానాలు ప్రచారం లో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు జగ్గారెడ్డి అరెస్టు.. గం‍డ్ర సోదరులపై కేసు నమోదు చేశారు. ఇక తరువాత టార్గెట్ రేవంత్ రెడ్డి అని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ని ఎలా ఇరికించాలా అని ఆలోచిస్తున్న కెసిఆర్ కి గతంలో జరిగిన ఓటు కు నోటు కేసుని తిరగతొడలని చూస్తున్నాడని సమాచారం. అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికలలో తన అభ్యర్థిని గెలిపించే క్రమంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రేవంత్‌ రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి ఈ వార్త చంద్రబాబు ను సైతం వదలలేదు. రేవంత్ మరియు స్టీఫెన్‌సన్‌ మధ్య జరిగిన సంబాషణలో చంద్రబాబు గొంతు కూడా ఉందని ఆయనే వీటన్నికి ఆయనే సూత్రధారి అని మీడియాలో చాల హంగామా సృష్టించారు.

ఆ తరువాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు జరుగుతున్నానాటకీయ పరిణామాలలో టీడీపీ తో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధపడుతుండటంతో ఈ రెండిటిని టార్గెట్ చేస్తూ ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.