//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెటిలర్స్ కు లోకల్ సర్టిఫికెట్లు .. కేసీఆర్ సంచలన నిర్ణయం

Category : politics state

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో ఉన్న ఆంధ్రా సెటిలర్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణాలో ఆంధ్రా వాళ్ళపై ఎలాంటి వివక్ష లేదని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగున్నరేళ్ళ పాలన లో ఏనాడు ఆంధ్రా సెటిలర్స్ ను ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు కేసీఆర్ . తెలంగాణ రాష్ట్రంలో పటాన్‌చెరు అనేది మినీ ఇండియా అంటూ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభివర్ణించారు.

అంటే ఈ ప్రాంతంలో ఒక్క తెలంగాణ వాళ్లే కాదు, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా నివశిస్తున్నారు. అయితే ఆంధ్రా ప్రజలు ఎలాంటి టెన్షన్ పడొద్దు అంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. పటాన్ చెరు నియోకవర్గంటో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు తెలంగాణ బిడ్డలేనని స్పష్టం చేశారు. కేసీఆర్ మీతో ఉండాడు. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉంటున్నారంటే వాళ్లు మా బిడ్డలే. వాళ్లు కూడా లోకల్ సర్టిఫికెట్లు తీసుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఆ మాటతో కేసీఆర్ ఆంధ్రా సెటిలర్స్ విషయంలో తన స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. ఈ సనచాలన నిర్ణయంతో ఆంధ్రా ప్రజల మనసు కొల్లగొట్టారు .

తెలంగాణలో వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదని తెలిపిన కేసీఆర్ దొర కొడుకుల్లాగా కలిసి ఉండండి అంటూ ప్రకటించారు. మరోవైపు జీవో 58 కింద హైదరాబాద్ పరిసరాల్లో గుడిసెలు వేసుకున్న వాళ్లందరికీ పట్టాలిచ్చామని తెలిపారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పట్టాలిచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు. ఎక్కడ గుడిసె వేసుకున్న వాళ్లకు అక్కడే పట్టా ఇచ్చామని ఒక్క పటాన్ చెరులోనే 5 వేల మంది జీవో 58 ద్వారా లబ్ధి పొందారని సీఎం కేసీఆర్ తెలిపారు.

పటాన్ చెరు అభ్యర్థి మహిపాల్ రెడ్డి 70 శాతం ఓట్లతో గెలుస్తాడని కొత్త సర్వే చెప్పిందని కేసీఆర్ చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హాజరైన ప్రజల్ని చూస్తే అది నిజమే అని డిక్లేర్ అయిపోయిందన్నారు. సభలోనే పటాన్ చెరు ప్రజలు మహిపాల్ రెడ్డిని గెలిపించారని చెప్పుకొచ్చారు కేసీఆర్ . మొత్తానికి మోఅదట నుదీ కేసీఆర్ కు ఆంధ్రా సేతిలర్స్ అంటే నచ్చాడు అని ఒక ఫోబియా ఉన్న తరుణంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా ప్రభావం చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఆంధ్రా స్తిలర్స్ కు లోకల్ సర్టిఫికెట్స్ ఇస్తామన్న కేసీఆర్ న్సంచాలన నిర్ణయం పై ఆంధ్రా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తే తెలంగాణా ప్రజలు మాత్రం షాక్ కు గురయ్యారు. ఆంధ్రా ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి కేసీఆర్ మరీ ఇలా హామీ ఇవ్వటం కరెక్టేనా అని ఆలోచనలో పడ్డారు.

Related News