//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేవంత్ రెడ్డిపై.. సీఎం కేసీఆర్ రంగ‌స్థ‌లం స్టైల్లో స్కెచ్‌..!

Category : politics state

కేసీఆర్ ప‌గ‌ప‌డితే ఎలా ఉంటుందో చెప్ప‌డానికి ఇది మాస్ట‌ర్ పీస్ ఎగ్జాంపుల్‌. అసెంబ్లీ ర‌ద్దు చేసుకున్నాక బొమ్మ తిర‌గ‌బడుతోంది. జ‌నం భ‌గ్గుమంటున్నార‌ని ప‌క్కా రిపోర్టులు వ‌స్తుంటే కేసీఆర్ మాత్రం.. నా ప‌గా.. నా ప్ర‌తీకార‌మంటూ ప్లాన్ చేసుకుంటున్నాడు.  అందుకే, మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాలు త‌రువాత సంగ‌తని ప‌క్క‌న పెట్టేశాడు. కొడంగ‌ల్ మీద ప్ర‌త్యేక దృష్టిపెట్టి స్కెట్ వేస్తున్నాడు. ఏకంగా రెండు రోజుల‌పాటు వ‌ర్క్‌షాపు కూడా పెట్టేశాడు. KCR Rangasthalam sketch on Revanth reddy

కేసీఆర్ రాజ‌కీయం ఇలానే ఉంటుంద‌.ఇ ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో.. వారికి ఏం కావాలో అన్న విష‌యం త‌రువాత‌. తాను చేయాల‌నుకున్న‌ది చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు కొడంగ‌ల్ మీద స్పెష‌ల్ ఫోక‌స్ అంతా పెడుతున్నాడు. కొడంగ‌ల్ రేవంత్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం.. అక్క‌డ రేవంత్ రెడ్డిని వీక్ చేసేందుకు ఎంత ట్రై చేసినా వీలు కాలేదు. రేవంత్‌రెడ్డి పార్టీ మారినా.. సొంతంగా హోల్డ్ నిలుపుకున్నాడు. అందుకే, మంత్రుల చేత దండ్ర యాత్ర చేయించినా.. ప‌దే ప‌దే మీటింగులు పెట్టించినా గ్రాఫ్ లేవ‌డం లేదు. KCR Rangasthalam sketch on Revanth reddy

ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి 68 శాత బ‌లం ఉంటే టీఆర్ఎస్‌కు మాత్రం క‌నీసం 25శాతం కూడా లేదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందుకే, ఏదో ఒక విధంగా ఇప్పుడు కొడంగ‌ల్ కావాల‌ని కేసీఆర్ కోరుకుంటున్నాడు. అందులో భాగంగా కొడంగ‌ల్ నేత‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించుకున్నాడు. ప్ర‌చారం ఎలా చేయాలి..?  బూత్‌లెవెల్ మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలి..?  రేవంత్ రెడ్డిని రాజ‌కీయంగా ఎలా దెబ్బ‌తీయాలి..? అన్న విష‌యాల‌మీద కేసీఆర్ స్వ‌యంగా త‌ర్ఫీదు ఇస్తున్నార‌ట‌. మ‌రి కేసీఆర్ ఇచ్చిన ఆ త‌ర్ఫీదు ఎంత వ‌రకు ప‌నిచేస్తుంద‌న్న విష‌యం తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే మ‌రి.KCR Rangasthalam sketch on Revanth reddy

Related News