Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ సంచలన నిర్ణయం ... నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటన

Category : politics state

తెలంగాణా ఎన్నికలనేపధ్యంలో కేసీఆర్ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. జిల్లా ప్రజల మన్ననలను పొందే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నాల్గోద జిల్లాలో సభలో పాల్గొన్న కేసీఆర్ నేను ఈ సారి నల్గొండ నుండి పోటీ చేద్దాం అనుకున్న, కానీ కుదరలేదు. ఈ విషయం మీద గతం లో జయశంకర్ సర్ ఉన్నప్పుడే చర్చ జరిగింది కానీ ఆయన మహబూబ్ నగర్ నుండి పోటీ చేయాలని కోరడంతో అక్కడి నుండే ఎంపీ గ పోటీ చేశానన్నాడు కెసిఆర్…

ఈ రోజు పాలమూరు ఎత్తిపోతల అద్భుతంగా జరుగుతోందని, దీంతో ఆ జిల్లా పచ్చబడిందన్నారు, దీనివల్లనే వలసలు కూడా ఆగిపోయాయని చెప్పారు. మళ్లీ ఈసారి ఎన్నికల్లో కూడా నల్గొండ నుంచి పోటీచేయాలనే ప్రతిపాదన వచ్చిందని, కానీ అందుకు గజ్వేల్‌ ప్రజలు అంగీకరించకపోవడంతో తన స్థానంలో భూపాల్‌ రెడ్డిని నల్గొండ నుంచి బరిలో దించినట్టు చెప్పారు కేసీఆర్. నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. గత పార్టీలపాలనలో విద్యుత్ కష్టాలు ఉండేవని, కానీ తెరాస అధికారం లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 24గంటల పాటు ప్రజలకు విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు.

తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్తు సరిగా ఉండడం లేదంటూ ప్రధాని మోదీ విమర్శలు చేయడంసారి కాదని చెప్పారు. గతంలో మైనార్టీల గురించి ఎవరూ పట్టించుకోలేదని, తెరాస వారి సంక్షేమానికి రూ. 2వేల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని చెప్పారు. మైనార్టీల విద్య కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేసినట్టు కేసీఆర్‌ వివరించారు.

పోచంపల్లి చేనేత కార్మికులు మరణిస్తే తాను కంటనీరు పెట్టానని కేసీఆర్‌ గుర్తుచేసుకొని బాధపడ్డారు. ఆనాడు బిక్షమెత్తి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. వృత్తులను నిలబెట్టుకుంటూ, కరెంటు కష్టాలు లేకుంటే చేసినట్లు కెసిఆర్ తెలిపారు. తెలంగాణలో నేడు గూండాలు, రౌడీలు, పేకాట క్లబ్బులు, గుడుంబా బట్టీలు, భూకబ్జాదారులు లేరని కేసీఆర్‌, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుపడ్డాయని తెలిపారు. నల్గొండ బాగుపడాలంటే తెరాసను గెలిపించాలని ప్రజలకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. నిజానిజాలు తెలుసుకొని ఓటు వేయాలని కెసిఆర్ ప్రజలని కోరాడు.